ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Dec 16, 2020 , 01:00:12

సాంకేతికతను వినియోగించుకోవాలి

సాంకేతికతను వినియోగించుకోవాలి

  • నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి 
  • నిర్మల్‌ సర్కిల్‌ కార్యాలయం తనిఖీ

నిర్మల్‌ అర్బన్‌ :  సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని నేరాల నియంత్రణకు కృషి చేయాలని నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం నిర్మల్‌ రూరల్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. పోలీసులతో కలిసి మొక్కను నాటారు. అనంతరం రికార్డులు పరిశీలించారు. స్టేషన్ల వారీగా కేసుల పెండింగ్‌, పురోగతి, దర్యాప్తు, కేసుల ఆన్‌లైన్‌ నిర్వహణను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా నేరాలు జరిగే ప్రాంతాల సమగ్ర సమాచారం గల మ్యాపింగ్‌ను టెక్నాలజీ సహాయంతో చేపట్టాలని సూచించారు. నేరం జరిగిక స్పందించే కంటే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని వ్యూహాత్మకమైన ప్రణాళికతో మందస్తు నేరనివారణ చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్‌ ఓఎస్డీ ఎం రాజేశ్‌ చంద్ర, అదనపు ఎస్పీ ఏ.రాంరెడ్డి, డీఎస్పీ ఉపేందర్‌ రెడ్డి, నిర్మల్‌ రూరల్‌ సీఐ వెంకటేశ్‌, శ్రీనివాస్‌, ఎస్‌ఐలు ఉన్నారు.


logo