సోమవారం 18 జనవరి 2021
Nirmal - Dec 15, 2020 , 00:31:19

రేపు ఉచిత గుండె వైద్య శిబిరం

రేపు ఉచిత గుండె వైద్య శిబిరం

నిర్మల్‌ టౌన్‌ : నిర్మల్‌ లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రియదర్శినగర్‌ కాలనీలో మంగళవారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు లయన్స్‌క్లబ్‌ నిర్వాహకుడు గంగారెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు నిర్వహించే శిబిరానికి గుండె వైద్య నిపుణులు కృష్ణంరాజు, నరేంద్ర ఓంకారి ఆధ్వర్యంలో ఉచిత పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.