మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Dec 15, 2020 , 00:31:19

పథకాలను వినియోగించుకోవాలి

పథకాలను వినియోగించుకోవాలి

నిర్మల్‌ టౌన్‌ : దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని దివ్యాంగులు,  వయోవృద్ధుల సంక్షేమశాఖ జిల్లా అధికారి స్రవంతి అన్నారు. దివ్యాంగుల సంక్షేమ కార్యాలయంలో సోమవారం సమావేశం నిర్వహించారు. అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని పేర్కొన్నారు. దివ్యాంగులను వివాహం చేసుకున్న వారికి రూ. లక్ష ప్రో త్సాహం అందిస్తున్నట్లు వివరించారు. అవసరమైన వారికి ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు, చేతికర్రలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘం నాయకులు సురేందర్‌, ఇసాక్‌ అలీ, క్రాంతి కుమార్‌, నర్సారెడ్డి, సట్టి సాయన్న, ప్రవీణ్‌కుమార్‌, రమేశ్‌ రెడ్డి, పంచపూల, సుజాత, హరిదాస్‌, శేఖర్‌ పాల్గొన్నారు. 


logo