బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 15, 2020 , 00:31:22

కరోనా వ్యాక్సిన్‌పై శిక్షణ

కరోనా వ్యాక్సిన్‌పై శిక్షణ

నిర్మల్‌ అర్బన్‌ : కరోనా వైరస్‌ కట్టడి కోసం రాష్ట్ర ప్రభుత్వం త్వరలో వ్యాక్సిన్‌ అందించనున్న నేపథ్యంలో వైద్యఆరోగ్య శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ సుధీర హైదరాబాద్‌ నుంచి సోమవారం జూమ్‌ ద్వారా జిల్లా అధికారులకు శిక్షణ ఇచ్చారు. వ్యాక్సినేషన్‌ ప్రణాళిక, కోల్డ్‌ చైన్‌ నిర్వహణ, లబ్ధిదారుల రిజిస్ట్రేషన్‌పై, టీకా ఇచ్చే ముందు పాటించవలసిన నియమనిబంధనలపై వివరించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ధన్‌రాజ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో అవినాష్‌, కార్తిక్‌, చుక్క శ్రీకాంత్‌, ఆశిష్‌ రెడ్డి, డిప్యూటీ మాస్‌ మీడియా అధికారి రవీందర్‌, చంద్రశేఖర్‌, గిరిబాయి, నరేశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo