బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 13, 2020 , 05:50:10

పల్లెల్లో సమస్యలు లేకుండా చేస్తాం..

పల్లెల్లో సమస్యలు లేకుండా చేస్తాం..

  • రాష్ట్ర అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
  • పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • రైతు వేదిక భవనం పరిశీలన
  •  సీఎంఆర్‌ఎఫ్‌  చెక్కుల పంపిణీ

భైంసా టౌన్‌ :  రాష్ట్రంలో ప్రతి పల్లెలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామని రాష్ట్ర దేవాదాయ, అట వీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండలంలోని మాటేగాం గ్రామంలో ప్రధానమంత్రి గ్రామ సడక్‌ యోజన కింద రూ.9.66 కోట్లతో నిర్మించే రోడ్డుకు ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావ్‌, ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి శనివారం  శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

ఈ రోడ్డు భైంసా మండలంలోని మా టేగాం నుంచి కుభీర్‌ మండలం చాతా గ్రామం మీదుగా కుంటాల మండలం లింబా(బి) వరకు ని ర్మించనున్నారు. అనంతరం వానల్‌పాడ్‌ గ్రామం లో రూ. 27 లక్షలతో నిర్మించిన శ్రీ రాజరాజేశ్వర కల్యాణ మండపాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే ఏం వస్తుందని ప్రశ్నించిన ప్రతిపక్షాలకు ఇప్పు డు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులు చెంపపెట్టు అని అన్నారు. రాష్ట్రంలో మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామానికీ డబుల్‌ రోడ్డును ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మాటేగాం నుంచి లింబా (బి) వరకు నిర్మించే రోడ్డు ద్వారా మూడు మండలాల ప్రజలకు దూర భారం తగ్గి ప్రయాణం సులభతరం అవుతుందన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ప్రతి గ్రామానికీ తాగునీటిని అందిస్తున్నామని పే ర్కొన్నారు. ప్రతి మండలంలోని క్లస్టర్లలో రైతు వేది క భవనాలను ఏర్పాటు చేశామని, రైతులకు ఇది ఒక వేదికగా అవుతున్నదన్నారు. రాష్ట్రంలో పురాతన ఆలయాలకు దేవాదాయ శాఖ ద్వారా నిధులు మంజూరు చేసి నూతన ఆలయాలను నిర్మిస్తున్నామని తెలిపారు. వానల్‌పాడ్‌లో అయ్యప్ప మహాపడి పూజకు హాజరై అభిషేకంలో పాల్గొన్నారు. 

రైతు వేదిక భవనం పరిశీలన..

మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామంలో నిర్మించిన రైతు వేదిక భవనాన్ని ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డితో కలిసి మంత్రి పరిశీలించారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా నిర్మల్‌ జిల్లాలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం, మండలాల్లో నూ ప్రజాప్రతినిధులతో రైతు వేదికలను ప్రారంభిస్తామన్నారు. ఈ రైతు వేదికలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మండలంలోని వానల్‌పాడ్‌ గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి పశువులకు ఉచిత నట్ట ల నివారణ కార్యక్రమ పోస్టర్‌ను విడుదల చేశారు. పశువులు ఉన్న ప్రతి ఒక్క రైతు ప్రభుత్వం ఉచితం గా వేసే నట్టల నివారణ టీకాలను వేయించాలన్నా రు. అనంతరం పశువులకు మంత్రి టీకా వేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మాన్కుర్‌ రాజన్న, నల్లోల సుశీల, సంజీవ్‌ రెడ్డి, విజయాబాయి, శ్రీనివాస్‌, మల్లేశ్‌, గణేశ్‌, అనురాధ, లావణ్య, ప్రసాద్‌, ఎంపీపీ కల్పన జాదవ్‌, వైస్‌ ఎంపీపీ గంగాధర్‌, ఏడీఅండ్‌ ఏహెచ్‌ రమేశ్‌ కుమార్‌, నాయకులు రామ్‌కుమార్‌, గణేశ్‌పటేల్‌, మధుసూదన్‌ రెడ్డి, అమేందర్‌రెడ్డి, రమణారెడ్డి, సోలంకి భీంరావ్‌, రాజేందర్‌, రాంకిషన్‌ రెడ్డి, బామ్ని రాజన్న, నీరజ్‌, లోలం శ్యాంసుందర్‌, గజానంద్‌, ఈశ్వర్‌, మంత్రి భోజారాం, డాక్టర్‌ విఠల్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.  logo