మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Dec 13, 2020 , 05:50:10

సీఎంఎఫ్‌ఆర్‌తో పేదలను ఆదుకుంటాం..

సీఎంఎఫ్‌ఆర్‌తో పేదలను ఆదుకుంటాం..

  •  రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి 

నిర్మల్‌ అర్బన్‌ : పేదల సౌకర్యార్థం అందించే సీఎం రిలీఫ్‌ ఫండ్‌తో అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్మల్‌ పట్టణంలోని మార్కెట్‌ ప్రాంతానికి చెందిన షరీఫ్‌ ఇటీవల అనారోగ్యంతో ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందగా.. సీఎం రిలీఫ్‌ఫండ్‌ ద్వారా మంజూరైన రూ.50 వేల చెక్కును శనివారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణ గౌడ్‌, ఎంపీపీ రామేశ్వర్‌ రెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు సుభాష్‌రావు, టీఆర్‌ఎస్‌ పార్టీ ఉమ్మడి జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు పాకాల రాంచందర్‌ పాల్గొన్నారు.