బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 11, 2020 , 00:12:17

నిధులున్నాయి..ఆందోళన చెందవద్దు

నిధులున్నాయి..ఆందోళన చెందవద్దు

  •  గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి 
  •  నిర్మల్‌ జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి 

ఖానాపూర్‌: గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరవుతున్నాయని, సర్పంచ్‌లు ఆందోళన చెందవద్దని నిర్మల్‌ జిల్లా జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి  తెలిపారు. ఖానాపూర్‌లో గురువారం నిర్వహించిన  మండల సర్వ సభ్య సమావేశానికి జడ్పీ చైర్‌ పర్సన్‌తో పాటుగా ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీపీ అబ్దుల్‌ మోయిద్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చే నిధులను ప్రణాళికా బద్ధంగా ఖర్చు చేసి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్‌లకు సూచించారు. సెగిగ్రేషన్‌ షెడ్లకు సంబంధించి బిల్లులు చెల్లించలేదని సర్పంచ్‌లు సభ దృష్టికి తెచ్చారు. దీనిపై డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మూడు రోజుల్లో ఈజీఎస్‌ డీఈని పంపించి సమస్య పరిష్కరిస్తామని తెలిపారు.

విద్యుత్‌ సరఫరా సమస్యలపై ఏఈ లచ్చన్నపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగి సీజన్‌లో దొడ్డు రకం వరిని సాగు చేయాలని, విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారి ఆసం రవి  తెలిపారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్‌బాబు, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎంపీడీవో బాలే మల్లేశం,  నాయబ్‌ తహసీల్దార్‌ ఫారూఖ్‌, పెంబి పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్‌ కిరణ్మయి, ఎంపీవో ఎస్‌ చంద్రశేఖర్‌, ఎంఈవో నేత గోపాల్‌, ఐసీడీఎస్‌ సీడీపీవో సరిత, ఏఈ గోపిడి విజయ్‌రెడ్డి, ఐకేపీ ఏపీఎం సునంద, ఈజీఎస్‌ ఏపీవో దాసరి ప్రమీల, మిషన్‌ కాకతీయ ఏఈ శ్రీనివాసరావు, భగీరథ ఏఈ కృష్ణ, ఎఫ్‌ఎస్‌వో సాంబయ్య, ఆర్టీసీ డిపో కంట్రోలర్‌ శంకర్‌నాయక్‌, హెచ్‌ఈవో శైలేంద్ర కన్నయ్య,  వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

జడ్పీ చైర్‌ పర్సన్‌కు సన్మానం

ఖానాపూర్‌ టౌన్‌: జడ్పీ చైర్‌ పర్సన్‌ విజయలక్ష్మి మొదటిసారిగా మండల సర్వ సభ్య సమావేశానికి హాజరైన సందర్భంగా మహిళా ప్రజా ప్రతినిధులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే రేఖానాయక్‌తో కలిసి పూలమాలతో సన్మానించారు. 


logo