బుధవారం 27 జనవరి 2021
Nirmal - Dec 09, 2020 , 00:26:31

రాస్తా బంద్‌

రాస్తా బంద్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో భారత్‌ బంద్‌ సూపర్‌ సక్సెస్‌

నిర్మల్‌/ ఆదిలాబాద్‌, నమస్తే తెలంగాణ : కేంద్ర ప్రభు త్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు  వ్యతిరేకంగా రై తులు ఇచ్చిన భారత్‌ బంద్‌కు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యా ప్తంగా అనూహ్య స్పందన లభించింది. సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనడంతో ప్రశాంతంగా, సంపూర్ణంగా సాగింది. ఉమ్మడి జిల్లాలోని ఆరు ఆర్టీసీ డిపోలకు చెందిన బస్సు లు ఉదయం నుంచి సాయం త్రం వరకు కదలలేదు. వ్యాపార, వాణిజ్య వర్గాలు స్వచ్ఛందంగా పాల్గొన్నాయి. ఉదయం దుకాణాలు తీయకపోగా.. మధ్యాహ్నం తర్వాత కొన్నిచోట్ల తెరుచుకున్నాయి. పల్లె నుంచి పట్టణం వరకు బంద్‌ విజయవంతంగా సాగ గా.. సబ్బండ వర్ణాలు పాల్గొన్నాయి. జాతీయ రహదారులతోపా టు ప్రధాన పట్టణాల్లో రైతులు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు, అఖిలపక్షం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. నిర్మల్‌ జిల్లా సోన్‌ మం డలం కడ్తాల్‌ వద్ద జాతీయరహదారిపై నిర్వహించిన రాస్తారోకోలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. దేశంలో వివిధ సంస్థలు, కంపెనీలను ప్రైవేట్‌ పరం చేస్తున్న మోదీ సర్కారు, ఇప్పుడు నూతన వ్య వసాయ చట్టం తెచ్చి కార్పొరేట్‌ కంపెనీలకు లబ్ధి చేకూర్చేలా చే స్తుందన్నారు. సన్న, చిన్నకారు రైతులు ఇతర ప్రాంతాలకు తమ పంటను తీసుకెళ్లి.. అమ్మే పరిస్థితి లేదన్నారు. రైతులు పండించిన పంటలకు ధరల కోసం మధ్యవర్తులపై ఆధార పడాల్సి ఉంటుందన్నారు. పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌, కేరళకు చెందిన రైతు లు ఢిల్లీలో చలిని కూడా లెక్క చేయకుండా పోరాడుతుంటే.. మో దీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రైతులు చేపట్టిన ఆందోళనకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లావ్యాప్తంగా భారత్‌ బంద్‌ విజయవంతమైంది. కాగా ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.

నిర్మల్‌ జిల్లాలో.. 

నిర్మల్‌ పట్టణంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో మంత్రి అల్లోల పా ల్గొన్నారు. జాతీయ రహదారి 44తోపాటు బాసర గోదావరి వంతె న, బెల్‌తరోడా వద్ద రాస్తారోకో చేశారు. ఆయా మండలాల్లోని రో డ్లపై అఖిలపక్షం నాయకులు కూడా రాస్తారోకో నిర్వహించారు. భైంసా, కుంటాల, బాసరలో జరిగిన రాస్తారోకోల్లో ము థోల్‌ ఎ మ్మెల్యే విఠల్‌రెడ్డి,  ఖానాపూర్‌లో ఎమ్మెల్యే రేఖానాయక్‌ పాల్గొన్నారు. వివిధ మండలాల్లో ఆందోళన చేసిన నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి.. సొంత పూచీకత్తుపై వదిలేశారు. కాగా.. ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌లో పాల్గొన్నాయి.

ఆదిలాబాద్‌ జిల్లాలో.. 

ఆదిలాబాద్‌ జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. టీఆర్‌ఎస్‌, కాం గ్రెస్‌, వామపక్షాలు, ఇతర పార్టీలు మద్దతు ప్రకటించా యి. నా యకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజలు బంద్‌లో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న భారీ మోటార్‌ సైకి ల్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మహారాష్ట్ర సరిహద్దు భోరజ్‌ వద్ద జా తీయ రహదారిపై బైఠాయించారు. బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావు తలమడుగు మండలం సుంకిడి వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. జడ్పీ చైర్మన్‌ జనార్దన్‌ రాథోడ్‌, డీసీసీబీ చైర్మన్‌ కాంబ్లె నాందేవ్‌ నార్నూర్‌లో జరిగిన ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదిలాబాద్‌లోని ఆర్టీసీ డిపో ఎదుట నిర్వహించిన నిరసనలో మున్సిపల్‌ చైర్మన్‌ జోగు ప్రేమేందర్‌ హాజరయ్యారు. సమ్మె కు ఆర్టీసీ సిబ్బంది మద్దతు ప్రకటించడంతో ఆదిలాబాద్‌, ఉట్నూ ర్‌ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఉదయం నుంచి వాణిజ్య, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. జైనథ్‌ మండలం భోరజ్‌ నేషనల్‌ హైవేపై రైతులు ఎడ్లబండ్లపై నిరసన తెలిపారు.

మంచిర్యాల జిల్లాలో.. 

చెన్నూర్‌ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ ఆధ్వర్యంలో జైపూర్‌ మండలం ఇందారం క్రాస్‌రోడ్డు వద్ద 63వ జాతీయ రహదారిపై రాస్తారోకో  నిర్వహించారు. మందమర్రి, రామకృష్ణాపూర్‌, జైపూర్‌, భీమారం, చెన్నూర్‌, కోటపల్లి ప్రాంతాలకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ మహాధర్నా మూడు గంటలపాటు కొనసాగింది. ఈ సం దర్భంగా ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మాట్లాడుతూ చట్టాల రద్దుకోసం అందరం కలిసి ఉద్యమిద్దామని  పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీలు పురాణం సతీశ్‌కుమార్‌, నారదాసు లక్ష్మణ్‌రావు, డీసీసీబీ చైర్మన్‌ తిప్పని లింగయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ప్రవీణ్‌, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌, నస్పూర్‌ ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పాల్గొన్నారు. ఆయనతోపాటు టీఆర్‌ఎస్‌ నాయకులు విజిత్‌రావు పాల్గొన్నారు. బంద్‌లో కార్మిక సంఘాలు కూడా పాల్గొనడంతో బస్సులు రోడ్డెక్కలేదు.

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో..

కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌ వద్ద అఖిలపక్షం నాయకులు రాస్తారోకో నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంఘీభావం ప్రకటించారు. అనంతరం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. దాదాపు ఆరు గంటల పాటు రాస్తారోకో చేయడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. జైనూర్‌ మండలంలో బంద్‌ స్వచ్ఛందంగా సాగింది. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రాష్ట్ర హజ్‌ కమిటీ సభ్యుడు ఇంతియాజ్‌లాల, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ కనక యాదవ్‌రావ్‌ పాల్గొన్నారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన భారత్‌ బంద్‌కు జడ్పీ వైస్‌ చైర్మన్‌ కోనేరు కృష్ణారావు మద్దతు పలికారు.logo