సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

- నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
- వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్ష
- గతనెలలో ప్రసవాలపై ఆరా
నిర్మల్ టౌన్ : నిర్మల్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ వైద్యాధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సాధారణ ప్రసవాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పీహెచ్‌సీలతో పాటు సామాజిక, ఏరియా దవాఖానల్లో గర్భిణులు చేరితే వారికి సాధారణ ప్రసవాలు చేసేలా వైద్యులు చూడాలని సూచించారు. గత నెలలో ఎన్ని సాధారణ ప్రసవాలు జరిగాయి? శస్త్ర చికిత్సల ద్వారా ఎన్ని? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ దవాఖానలకు వచ్చే రోగుల్లో ఎక్కువ మంది పేదవారే ఉంటారని తెలిపారు. ప్రైవేట్ దవాఖానల్లోనూ సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేలా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ప్రతి అంగన్వాడీ కార్యకర్త గర్భిణి వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రసవ సమయంలో ప్రభుత్వం ద్వారా నిర్వహించబడుతున్న 108, 102 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి దవాఖానలో కనీసం 20శాతం సాధారణ ప్రసవాలు జరగేలా చూడాలన్నారు. ఇప్పటికే ఖానాపూర్, కడెం, నిర్మల్, నర్సాపూర్ దవాఖానల్లో పనిచేసే సిబ్బంది సహకారంతో సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో వైద్య ఆరోగ్యశాఖ కృషి చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్, వైద్యులు దేవేందర్‌రెడ్డి, కార్తీక్, రజిని, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ముందే శ్వేతసౌధాన్ని వీడనున్న ట్రంప్!
- కమలా హర్రీస్ రాజీనామా.. దేనికంటే!
- టెస్లా మస్క్ స్టైలే విభిన్నం: పన్ను రాయితీకే మొగ్గు
- ఆ సీక్రెట్ అతనొక్కడికే తెలుసంటున్న నిహారిక..!
- చిరంజీవి మెగా ప్లాన్.. ఒకేసారి 2 సినిమాలకు డేట్స్..!
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?