‘సాగు’ చట్టాలపై రైతు రణం

- నేటి భారత్ బంద్‌కు టీఆర్ఎస్ సంపూర్ణ సంఘీభావం
- శ్రేణులు ప్రత్యక్షంగా పాల్గొనాలని కేసీఆర్, కేటీఆర్ పిలుపు
- రైతు ధర్నాలో పాల్గొననున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
- సక్సెస్ చేయాలని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల పిలుపు
- మద్దతుగా నిలుస్తున్న ఇతర పార్టీల నాయకులు
మోడీ సర్కారు తెచ్చిన వ్యవసాయ వ్యతిరేక చట్టాలపై రైతు రణం మోగించాడు. మంగళవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాడు. నూతన చట్టాలు రైతుల బతుకు లను బుగ్గిపాలు చేసేలా ఉన్నాయని, బలవంతంగా రుద్దడానికి తెచ్చిన చట్టాలను రద్దు చేసేదాకా రణం చేస్తామని బంద్ పాటిస్తున్నారు. ఇందుకు టీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ సంఘీభావం ప్రకటిస్తున్నది. క్షేత్రస్థాయి నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు బంద్‌లో భాగస్వాములు కావాలని సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పిలుపునిచ్చారు. ఈ క్రమంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నిర్మల్ జిల్లా కడ్తాల్ వద్ద జరిగే రైతు ధర్నాలో పాల్గొంటారు. ఎమ్మెల్యేలు, నాయకులు స్థానికంగా నిర్వహించే రాస్తారోకోలు, ధర్నాల్లో భాగస్వాములు కానున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతాంగం నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఈ చట్టాలు రైతుల పొట్టగొట్టి.. కార్పొరేట్ సంస్థల కడుపు నింపే విధంగా ఉన్నాయని, వ్యవసాయం బడాబాబుల చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లు నిర్వీర్యమై, రైతులకు మద్దతు ధర దక్కక, వ్యాపారులు నిర్ణయించిన ధరకే పంట ఉత్పత్తులు అమ్ముకోవాల్సి వస్తుందని మండి పడుతున్నారు. రైతులతోపాటు వినియోగదారులకు కీడు చేసేలా ఉన్నదని, పప్పుధాన్యాల కృత్రిమ కొరత సృష్టించే అవకాశం ఉందనే భావన వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది. మూడు చట్టాల్లో ఒకటి వ్యాపార, వాణిజ్య చట్టం.. రెండోది సేవల ఒప్పందాల చట్టం.. మూడోది నిత్యావసర సరుకుల సవరణ చట్టం ఉండగా.. ఇవీ తమకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని రైతులు ఆందోళనబాట పట్టారు. మూడు బిల్లులను లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టి చర్చించి.. రాష్ట్రపతి ఆమోదం తర్వాత సెప్టెంబర్ 24న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి.. చట్టాలుగా మార్చారు. ఈ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 12 రోజులుగా రైతులు ఢిల్లీలో ఆందోళన బాట పట్టారు.
- నిర్మల్/ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ
రైతు వ్యతిరేక బిల్లుల సారాంశం..
వ్యాపార, వాణిజ్య బిల్లు : కార్పొరేట్ సంస్థలకు అనుకూలం. పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. రైతులు ఎన్ని ఊర్లు తిరగాలి? ఎన్ని రాష్ర్టాలు దాటాలి?
సేవల ఒప్పందాల బిల్లు : దీనితో సొంత పొలంలో రైతు కూలీగా మారే దుస్థితి. కార్పొరేట్ కంపెనీలు చెప్పినట్టు వినాల్సి వస్తుంది.
నిత్యావసర సరుకుల సవరణ బిల్లు : భారీ ఎత్తున సరుకులను నిల్వ చేసుకునే అవకాశం ఉంది. ఫలితంగా వ్యాపార సంస్థలకు భారీగా లాభం చేకూరుతుంది.
వ్యాపారులకే లాభమైతది..
బోథ్ : కేంద్ర సర్కారోళ్లు తీసుకచ్చిన చట్టాలతో వ్యాపారులకే మస్తు లాభం. మేము రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి పండించిన పంటను వాళ్లు చెప్పిన ధరకే అమ్ముకోవాలా? ఇదెక్కడి న్యాయం. ఇప్పుడైతే సర్కారోళ్లు నిర్ణయించిన ధరకే మా దగ్గర కొంటున్రు. కేంద్రం తీసుకొస్తున్న బిల్లుతో మాకు నష్టం ఉంటది. కార్పొరేట్లు మా దగ్గర కొన్న పంటను దాచుకొని ధర వచ్చినప్పుడే అమ్ముకుంటరు. అప్పుడు గాళ్లకే కదా లాభం ఉంటది. రైతులు ఢిల్లీ కాడ ధర్నా చేస్తున్నా బీజేపీ గవర్నెమెంటోళ్లు పట్టించుకోక పరేషాన్ చేస్తన్రు.
-గొండ్ల శివ్వన్న, రైతు, పొచ్చెర
తాజావార్తలు
- ఇంటికైనా మట్టికైనా మనోడే ఉండాలి
- రేపటి ర్యాలీకి సిద్ధమైన రైతుల ట్రాక్టర్లు
- బాలికపై బ్యాంకు మేనేజర్ అత్యాచారం..!
- ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్
- ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు : మంత్రి హరీశ్ రావు
- ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ తుది పోరు వాయిదా
- ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు కేంద్రం సమాలోచన!
- హల్దీ వేడుకల్లో వరుణ్ ధావన్ హల్చల్
- నాటు వేసిన ఐఎఫ్ఎస్ అధికారి
- సాయిధరమ్ ‘రిపబ్లిక్’ మోషన్ పోస్టర్