మౌలిక సదుపాయాల కల్పనకు కృషి

- రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి
సోన్ : గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోన్ మండలంలోని మాదాపూర్ గ్రామం వద్ద స్వర్ణ వాగుపై నూతనంగా నిర్మించే బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆదివారం భూమిపూజ చేశారు. రూ.2 కోట్ల 70లక్షల నిధులతో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 20 యేండ్ల క్రితం స్వర్ణవాగుపై బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టగా.. అది శిథిలావస్థకు చేరుకోవడం, ఎత్తు తక్కువగా ఉండడం, వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు తలెత్తడంతో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజల మౌలిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. రహదారుల నిర్మాణం, బ్రిడ్జిల నిర్మా ణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వి.సత్యనారాయణగౌడ్, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణప్రసాద్‌రెడ్డి, సోన్ మండల కన్వీనర్ మోహినొద్దీన్, సర్పంచ్ రాంనర్సింహారెడ్డి, సోన్ సర్పంచ్ వినోద్, తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- రకుల్ జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
- రిషబ్ పంత్ సూపర్ షో..
- ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా
- కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి
- ఖుషీ కపూర్ ఎంట్రీపై బోనీ కపూర్ క్లారిటీ..!
- తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన ఇందిరమ్మ
- నేతాజీ జయంతి ఇక పరాక్రమ్ దివస్
- రిపబ్లిక్ డే వేడుకలకు వారికి అనుమతి లేదు..
- ఆయిల్ పామ్ సాగుకు మరింత ప్రోత్సాహం : మంత్రి నిరంజన్‌రెడ్డి
- ఆస్ట్రేలియాలో క్వారెంటైన్.. టెన్షన్లో టెన్నిస్ ప్లేయర్లు