మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Dec 07, 2020 , 01:11:22

హోంగార్డుల సేవలు మరువలేనివి : ఏఎస్పీ రాంరెడ్డి

హోంగార్డుల సేవలు మరువలేనివి : ఏఎస్పీ రాంరెడ్డి

సోన్‌ : శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులు కీలకపాత్ర పోషిస్తున్నారని నిర్మల్‌ ఏఎస్పీ రాంరెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం హోంగార్డుల దినోత్సవాన్ని పురస్కరించుకొని పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులతో సమానంగా నిత్యం విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణలో హోంగార్డులు విశేషమైన కృషి చేస్తున్నారన్నారు. హోంగార్డుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, ఆర్‌ఐ వెంకటి, ఎంటీవో ఆర్‌ఐ కృష్ణ ఆంజనేయులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.