సోమవారం 25 జనవరి 2021
Nirmal - Dec 06, 2020 , 01:50:43

ఎంపీ కేకేను కలిసిన మంత్రి అల్లోల

ఎంపీ కేకేను కలిసిన మంత్రి అల్లోల

నిర్మల్‌ అర్బన్‌ : టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ, ఎంపీ కేశవరావును బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్‌ డివిజన్‌ కార్పొరేటర్‌గా ఆయన కూతురు విజయలక్ష్మి గెలిచిన సందర్భంగా వారికి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తమ విజయానికి కృషి చేసినందుకు కేశవరావు, గద్వాల్‌ విజ యలక్ష్మి వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నా రు. ఎంపీ కేశవరావును హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌, పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు కలిశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసీ భారీ మెజార్టీతో గెలువడంతో కేశవరావును, గద్వాల విజయలక్ష్మిని మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. logo