పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం

- నిర్మల్ జిల్లాకు ఎంతో పురాతన చరిత్ర
- పట్టణంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు
- మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
- మౌంటెడ్ లాడర్ వాహనం ప్రారంభం
- రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనుల పరిశీలన, మైనార్టీలకు దుస్తుల పంపిణీ
నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లాకు పురాతన చరిత్ర ఉన్నదని, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో గురువారం పురపాలక శాఖ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన హైడ్రాలిక్ మౌంటెడ్ లాడర్ వాహనాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో నలువైపులా సెంట్రల్ లైటింగ్ సిస్టంతో పాటు ప్రధాన కూడళ్లు, ఇతర చోట్ల 14 హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేసుకున్నామన్నారు. వాటిలో ఏదైనా సాంకేతికపరమైన సమస్యలు వస్తే హైడ్రాలిక్ మౌంటెడ్ లాడర్ వాహనంతో తక్కువ వ్యవధిలోనే మరమ్మతులు చేసుకోవచ్చని తెలిపారు. దీంతో పట్టణంలో విద్యుత్ స్తంభాలతో సమస్యలుండవన్నారు. పురాతన కోట శ్యామ్ఘడ్ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రూ.35 లక్షలతో కోట చుట్టూ లైటింగ్ ఏర్పాటు చేశామని, పట్టణ ప్రజలతో పాటు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వీ సత్యనారాయణ గౌడ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
అభివృద్ధి పనుల పరిశీలన..
నిర్మల్ పట్టణంలోని ఈద్గాం చౌరస్తా, చైన్‌గేట్ నుంచి బంగల్పేట్ వరకు కొనసాగుతున్న రోడ్డు విస్తరణ, డ్రైనేజీల నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. పనుల వివరాల గురించి స్థానిక నాయకులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. మంత్రి వెంట మున్సిపల్ కౌన్సిలర్లు ఎడిపెల్లి నరేందర్, పూదరి రాజేశ్వర్, నాయకులు మేడారం ప్రదీప్, పద్మాకర్, కోటగిరి అశోక్ తదితరులు ఉన్నారు.
మైనార్టీలకు దుస్తుల పంపిణీ..
స్థానిక నిర్మల్ ఫలాహే ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో 150 మంది పేద ముస్లింలకు నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి మంత్రి అల్లోల దుస్తులు, బ్లాంకెట్లు, స్కార్ఫ్‌లను అందజేశారు. ఇక్కడ మంత్రి అల్లోల మాట్లాడుతూ.. సొసైటీ ఆధ్వర్యంలో పేదలకు చేయూతనందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ ముజాహిద్ అలీ, అబ్దుల్లా, నహీమొద్దీన్, సయ్యద్ అబ్రార్, ముజాహిద్ బిన్ మహ్మద్, రఫియొద్దీన్, సయ్యద్ మజర్, అలీఖాన్, ఫిరోజ్ ఖాన్, అఫ్సర్, ఫర్వేజ్, నజీర్, సల్మాన్, అమీర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- వరుణ్‌ధావన్ పెండ్లికి రానున్న స్టార్ హీరోలు..!
- బ్రెయిన్‌డెడ్ యువకుడి అవయవాలు దానం
- నడ్డా ఎవరు? ఆయనకెందుకు సమాధానమివ్వాలి: రాహుల్ సైటైర్లు
- పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నదే అందుకట..!
- యాదాద్రీశుడికి సంప్రదాయ పూజలు
- రోటోవేటర్ కిందపడి బాలుడు మృతి
- విజయ్ దేవరకొండపై భారీ బడ్జెట్ వర్కవుట్ అయ్యేనా..?
- శ్రీశైలం మల్లన్న హుండీ ఆదాయం రూ.3.82 కోట్లు
- 'వకీల్‌సాబ్' కామిక్ బుక్ కవర్ లుక్ అదిరింది
- 23న ఎఫ్‌టీసీసీఐ అవార్డుల ప్రదానోత్సవం..