సోమవారం 25 జనవరి 2021
Nirmal - Dec 04, 2020 , 01:25:17

మోదీ దిష్టిబొమ్మ దహనం

మోదీ దిష్టిబొమ్మ దహనం

వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్మల్‌ కలెక్టరేట్‌ ఎదుట గురువారం ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్పొరేట్‌ను ప్రోత్సహించేలా బిల్లులు తేవడం వల్ల రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నాయకుడు దుర్గం నూతన్‌కుమార్‌ పేర్కొన్నారు. బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు విలాస్‌, అశోక్‌, నగేశ్‌, అఫ్జల్‌ తదితరులు పాల్గొన్నారు.   

 - నిర్మల్‌ టౌన్‌


logo