ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Dec 03, 2020 , 00:20:30

అంతర్‌ జిల్లాల బదిలీలకు సర్కారు అంగీకారం

అంతర్‌ జిల్లాల బదిలీలకు సర్కారు అంగీకారం

  • ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి

బోథ్‌: ఉపాధ్యాయుల అంతర్‌ జిల్లాల బదిలీకి ప్రభుత్వం సూత్రపాయంగా అంగీకరించినట్లు పీఆర్టీ యూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి తెలిపారు. మండల కేంద్రంలోని ఉర్దూ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహించిన పీఆర్టీయూ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఈ నెలాఖరు వరకు అంతర్‌ జిల్లాల బదిలీలతో పాటు ఉద్యోగోన్నతులకు ఇటీవల మంత్రి కేటీఆర్‌తో నిర్వహించిన సమావేశంలో ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. లేని పక్షంలో ఉపాధ్యాయ సమస్యల కోసం వచ్చే జనవరి నుంచి ఉద్యమానికి ఉపాధ్యాయులంతా సిద్ధంగా ఉండాలన్నారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు కృష్ణకుమార్‌,ప్రధాన కార్యదర్శి రవీందర్‌, ఎంఈవో గణపతి, ప్రధానోపాద్యాయుడు ముంతాజ్‌ఖాన్‌, ఆర్‌టీవీ ప్రసాద్‌, బాల్‌చందర్‌, సుభాష్‌నాయక్‌, గంగయ్య, మునీందర్‌రాజు, స్వామి పాల్గొన్నారు. 

నిర్మల్‌ అర్బన్‌ : ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటులో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. అనంతరం ఆయనను సన్మానించారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రమణారావు, ప్రధాన కార్యదర్శి నరేంద్ర బాబు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు మైస అరవింద్‌, మల్కాగౌడ్‌, శ్రీనివాస్‌, అన్సర్‌,లస్మన్న, సిద్ధారాం,రమాదేవి ఉన్నారు.  పీఆర్టీయూ సభ్యత్వ నమోదును పట్టణంలోని శాంతినగర్‌ గురుకుల పాఠశాలలో చేపట్టారు. సంఘం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను ఉపాధ్యాయులకు వివరించి సభ్యత్వ సమోదు చేపట్టారు. 


logo