మంగళవారం 26 జనవరి 2021
Nirmal - Dec 02, 2020 , 00:31:31

గులాబీ జెండా ఎగరడం ఖాయం

గులాబీ జెండా ఎగరడం ఖాయం

  • జీహెచ్‌ఎంసీ  ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌కే పట్టం
  • ప్రచారంలో పాల్గొన్న పార్టీ నాయకులకు కృతజ్ఞతలు
  • రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి

నిర్మల్‌ అర్బన్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ఎన్నికల్లో భాగంగా బంజారాహిల్స్‌ డివిజన్‌లో ఎంపీ కేశవరావు కూతురు, గద్వాల్‌ విజయలక్ష్మికి మద్దతుగా ప్రచారం చేసిన టీఆర్‌ఎస్‌ నిర్మల్‌ నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.


ఎన్నికల ప్రచారం ముగించుకొని నిర్మల్‌కు పయనమైన సందర్భంగా, నియోజకవర్గ నాయకులను ఉద్దేశించి మాట్లాడారు. తామంతా ఒక కుటుంబం అని భావించి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయలక్ష్మి తరఫున ఇంటింటికీ తిరుగుతూ సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ఓటర్లకు వివరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గతంలో అనేకసార్లు ఎన్నికల ప్రచారం చేసిన నిర్మల్‌ ప్రాంత నాయకుల అనుభవం.. హైదరాబాద్‌ పార్టీ శ్రేణులకు తోడవడంతో మరింత ఉత్సాహంతో ప్రచారం కొనసాగించారన్నారు. బంజారాహిల్స్‌ అభ్యర్థి విజయలక్ష్మి విజయం సాధించబోతోందని, బల్దియాలో గులాబీ జెండాను ఎగురవేయడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవరావుకు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి, నిర్మల్‌ నియోజకవర్గ నేతలకు అభ్యర్థి గద్వాల్‌ విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.


logo