శనివారం 16 జనవరి 2021
Nirmal - Dec 01, 2020 , 04:03:03

నేటి నుంచి జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ

నేటి నుంచి జీవాలకు నట్టల నివారణ మందుల పంపిణీ

నిర్మల్‌ టౌన్‌: నిర్మల్‌ జిల్లాలోని గొర్రెలు, మేకలకు సీజనల్‌గా వచ్చే వ్యాధుల నివారణలో భాగంగా డిసెంబరు 1 నుంచి 7వ తేదీ వరకు నట్టల నివారణ టీకాల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా పశువైద్యాధికారి రమేశ్‌కుమార్‌ తెలిపారు. జిల్లాలో మొత్తం 42 పశువైద్యశాలల పరిధిలో 37 బృందాలను ఏర్పాటు చేసి నట్టాల నివారణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో 5లక్షల గొర్రెలు, లక్ష మేకలకు ఈ టీకాలను వేసే విధంగా కార్యాచరణ రూపొందించామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.