మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Nov 30, 2020 , 05:57:15

అడెల్లి ఆలయానికి రూ.2 లక్షల విరాళం

అడెల్లి ఆలయానికి రూ.2 లక్షల విరాళం

సారంగాపూర్‌ :  మండలంలోని అడెల్లి పోచమ్మ దేవస్థానానికి సోన్‌ మండలంలోని వెల్మల్‌ గ్రామానికి చెందిన దయాసాగర్‌ రూ. 2లక్షల విరాళాన్ని ఈవో మహేశ్‌కు ఆదివారం అందజేశాడు. రెండు వసతి గదుల నిర్మాణానికి విరాళాన్ని అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ రమణారావు, నాయకులు పదిరె లక్ష్మారెడ్డి  తదితరులు పాల్గొన్నారు. 

నిర్మల్‌ కోర్టు పీపీ వినోద్‌రావు పూజలు.. అడెల్లి మహాపోచమ్మ అమ్మవారిని నిర్మల్‌ కోర్టు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వినోద్‌రావు కుటుంబ సమేతంగా దర్శించుకుని, పూజలు చేశారు.