సోమవారం 18 జనవరి 2021
Nirmal - Nov 29, 2020 , 00:40:00

ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు

ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన సేవలు

నిర్మల్‌ అర్బన్‌ : ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు మెరుగైన సేవలు అందుతున్నాయని  జిల్లా వైద్యశాల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ దేవేందర్‌ రెడ్డి తెలిపారు. జిల్లా ప్రభుత్వ దవాఖానలో మెరుగైన శస్త్ర చికిత్స  నిర్వహించినట్లు తెలిపారు.మంచిర్యాల జిల్లాకు చెందిన గురువమ్మ వృద్ధురాలు తుంటి (కీళ్ల) నొప్పితో బాధ పడుతున్నది. ఆమె కూతురు భైంసా ప్రాంతీయ వైద్యశాలలో నర్సుగా పనిచేస్తున్నది. అక్కడి వైద్యుల సహాయంతో జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లారు. ఆర్థో వైద్యులు రఘునందర్‌ రెడ్డి, అరుణ్‌ రెడ్డి కీళ్ల మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. ఆమె కోలుకుంటున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఆర్‌ఎంవో వేణుగోపాల్‌ రెడ్డి తదితరులున్నారు.