కేసులను సత్వరమే పరిష్కరించాలి

- నిర్మల్ ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్
- సోన్, దిలావర్పూర్ పోలీస్ స్టేషన్లలో ఆకస్మిక తనిఖీ
సోన్ : నేరాల నియంత్రణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైందని, ప్రజలకు పూర్తి భద్రత క ల్పించాల్సిన అవసరం ఉందని నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ అన్నారు. సోన్ పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల వివరాల గురించి పోలీ సులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా ఇన్చార్జి ఎస్పీకి సోన్ ఎస్ఐ ఆసిఫ్ ఆధ్వర్యంలో గౌరవ వందనాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ.. కేసులను సత్వరం పరిష్కరించాలన్నారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. గ్రామాల్లో నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే ప్రజల సహకారం పెంపొందించుకోవాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి, సీఐ జీవన్‌రెడ్డి ఉన్నారు.
దిలావర్పూర్ పోలీస్‌స్టేషన్ తనిఖీ..
దిలావర్పూర్ : దిలావర్పూర్ పోలీస్ స్టేషన్‌ను ఇన్చార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి, కేసుల వివరాల గురించి స్థానిక ఎస్ఐ సంజీవ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్ర మాదాల నివారణపై అవగాహన సదస్సులు ఏ ర్పాటు చేసి, విస్తృతంగా ప్రచారం చేయాలన్నా రు. జాతీయ రహదారిపై నిత్యం వాహనాల తనిఖీ చేపట్టాలని సూచించారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిత్యం యోగా, వ్యాయా మం చేయాలన్నారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి, స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. నిర్మల్ గ్రామీణ సీఐ వెంకటేశ్, ఎస్ఐ సంజీవ్‌కుమార్, పోలీసులు ఉన్నారు.