సోమవారం 18 జనవరి 2021
Nirmal - Nov 28, 2020 , 00:31:00

కొనుగోళ్లు వేగవంతం చేయాలి

కొనుగోళ్లు వేగవంతం చేయాలి

  • అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలి
  • నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

లక్ష్మణచాంద :  ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులకు నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ సూచించారు. మండలంలోని పీచర గ్రామంలో మక్కల కొనుగోలు కేంద్రం, పంట కల్లాలను.., రాజాపూర్‌లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు, రైతులకు పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను వెంటనే పూర్తిచేయాలన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడవకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా సంబంధిత శాఖల అధికారులు ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. కలెక్టర్‌ వెంట అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి కిరణ్‌కుమార్‌, తహసీల్దార్‌ సత్యనారాయణ, ఎంపీడీవో మోహన్‌, ఏపీవో దివ్య, పంచాయతీ కార్యదర్శి సాయిశృతి, రైతులు ఉన్నారు.