ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Nov 27, 2020 , 00:40:08

భారత రాజ్యాంగం గొప్పది

భారత రాజ్యాంగం గొప్పది

  •  నిర్మల్‌ జిల్లా ఏఎస్పీ రాంరెడ్డి 

నిర్మల్‌ అర్బన్‌ : ప్రపంచంలో భారత రాజ్యాం గం అతి పెద్ద లిఖిత రాజ్యాంగమని నిర్మల్‌ జిల్లా ఏఎస్పీ రాంరెడ్డి పేర్కొన్నారు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును పురస్కరించుకొని, జిల్లా ఇన్‌చార్జి ఎస్పీ విష్ణుఎస్‌ వారియర్‌ ఆదేశాల మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. దేశ ప్రజలంతా సమానత్వం, శాంతి, సౌబ్రాతృత్వంతో జీవించాలన్న సంకల్పంతో రాజ్యాంగం ద్వారా హక్కులను అందించిన మహనీయుడు అంబేద్కర్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకట శేఖర్‌, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌  వెంకటి, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు జయరాం నాయక్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. బార్‌ అసోసియేషన్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లారెడ్డి, ప్రధాన కార్యదర్శి రమణరావు, శ్రీనివాస్‌, మహేందర్‌, వెంకట్‌, మహేందర్‌, అనిల్‌ కుమార్‌, ఖాజా, ఆసిఫ్‌, రమణ, వెంకటేశ్‌, మధూకర్‌ తదితరులున్నారు. తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో సహాయ ప్రిన్సిపాల్‌ రోహిణి, ఉపాధ్యాయులు వెంకట్‌, సంతోష్‌, గణేశ్‌, ఓదేలు, దేవేందర్‌, సూర్య ప్రకాశ్‌, మార్గరేట్‌, జ్యోతి, సారిక, వీణారాణి, వనజ, ఇందిర, రజిత, అపర్ణ జ్యోతి, సురేశ్‌, బ్యూలా తదితరులున్నారు. 

భైంసా టౌన్‌ : మండలంలోని దేగాం గ్రామంలో డా.బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని భైంసా డీఎస్పీ నర్సింగ్‌రావు అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ శ్రీనివాస్‌రావు, భైంసా ఏరియా దవాఖాన సూపరింటెండెంట్‌ డా.కాశీనాథ్‌, మైసేకర్‌ సాయిలు, మోహన్‌ రెడ్డి, రూరల్‌ ఎస్‌ఐ పున్నం చందర్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. మండలంలోని మిర్జాపూర్‌, దేగాం, మహాగాం తదితర గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు. మహాగాం ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ఖయ్యూం తదితరులు పాల్గొన్నారు. 

భైంసా : పట్టణంలోని బస్టాండ్‌ సమీపంలో గల అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది ప్రసన్నజిత్‌ ఆగ్రే, నాయకులు మైసేకర్‌ సాయిలు, భీంరావ్‌ డొంగ్రే, గంగాధర్‌ దగ్డే తదితరులున్నారు. 

నిర్మల్‌ టౌన్‌ : నిర్మల్‌లోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో అంబేద్కర్‌ చిత్రపటం వద్ద జడ్పీ సీఈవో సుధీర్‌ కుమార్‌తో పాటు జిల్లా అధికారులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లోలం శ్యాంసుందర్‌, అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌, కిరణ్‌కుమార్‌, నర్సింహరెడ్డి, రమేశ్‌ కుమార్‌, శరత్‌ బాబు , సాగర్‌ రెడ్డి గణపతి, నారాయణ తదితరులున్నారు. నిర్మల్‌ తహసీల్‌ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్‌ సుభాష్‌చందర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ హన్మాండ్లు, కార్యాలయ సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్సర్‌ అహ్మద్‌, అప్రోజ్‌ఖాన్‌, మురాజ్‌బేగ్‌లు పాల్గొన్నారు. 

బాసర : తహసీల్దార్‌ కార్యాలయంలోనిర్వహించిన కార్యక్రమంలో తహసీల్దార్‌ శివప్రసాద్‌, డీటీ తెలంగారావు,  అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

కుంటాల : మండల కేంద్రంలో అంబేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కుంటాల ఎస్‌ఐ శ్రీకాంత్‌, మగ్గిడి దిగంబర్‌, మట్ట కరుణాకర్‌, నాయకులు టీ వెంకటేశ్‌, పీ దశరథ్‌, భూమేశ్‌, సాయి కృష్ణ, బాలయ్య, కిరణ్‌, నిఖిల్‌, సాయి తదితరులు పాల్గొన్నారు. విట్టాపూర్‌లో  సర్పంచ్‌ లక్ష్మి, రమేశ్‌ పాల్గొన్నారు. కుంటాల జడ్పీ హైస్కూల్‌లో హెచ్‌ఎం సగ్గం గంగాధర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.     

ఖానాపూర్‌ టౌన్‌: ఖానాపూర్‌ పట్టణంలోని పాత బస్టాండ్‌ ఏరియాలోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆల్‌ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, టీజీవో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనాయక్‌, ఎస్‌సీ, ఎస్‌టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్‌ వెంకట్రావ్‌, అంబేద్కర్‌ సంఘం జిల్లా ఉప అధ్యక్షుడు ద్యావతి రాజేశ్వర్‌, మండల ప్రధాన కార్యదర్శి దాసరి రాజేశ్వర్‌, దళిత సంఘల నాయకులు రాసమొల్ల రాజశేఖర్‌, నేత శ్రీహరి, సంగర్తి రాజన్న, కట్ట శ్రీనివాస్‌, నేత శ్యామ్‌, సుమన్‌, దళిత, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

దస్తురాబాద్‌ : మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, అంబేద్కర్‌ సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో  వైస్‌ ఎంపీపీ భూక్యా రాజు నాయక్‌,  సర్పంచ్‌లు దుర్గం శంకర్‌, నాగవత్‌ సురేశ్‌ నాయక్‌, దుర్గం పోశలింగం, ఉప సర్పంచ్‌ కొమురెళ్లి, కట్కూరి రాజేశ్‌, ఎంపీడీవో ఆర్ల గంగాధర్‌, డిప్యూటీ తహసీల్దార్‌ పద్మావతి, ఆర్‌ గంగన్న, అంబేద్కర్‌ సంఘం మండల అధ్యక్షుడు మునేసుల శైలేందర్‌, టీఆర్‌ఎస్‌ మండల ప్రధాన కార్యదర్శి దాసరి సుధాకర్‌, నాయకులు సంతపూరి శ్రీనివాస్‌, దీటి సత్తన్న, సిర్ప సంతోష్‌, సీహెచ్‌ నర్సయ్య, కొక్కుల రాజేశం, వెంకట నర్సయ్య, భీం సేన యువజన సంఘం అధ్యక్షుడు జాడి చంద్రశేఖర్‌, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

ఖానాపూర్‌:  ఖానాపూర్‌ ప్రభుత్వ దవాఖానలో నిర్వహించిన కార్యక్రమంలో దవఖాన హెచ్‌ఈవో శైలేంద్ర కన్నయ్య, ఎస్‌వీవో రవికుమార్‌, హెచ్‌ఈలు లత, పోసాని, సుజాత, సూపర్‌వైజర్‌  జ్ఞానేశ్వర్‌, ఏఎన్‌ఎంలు స్వాతి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ రజిత, ఎన్‌ఎస్‌ఎస్‌ ప్రోగ్రాం అధికారి క్యాస సంతోష్‌కుమార్‌, అధ్యాపకులు మోహన్‌, నరహరి, శ్రీనివాస్‌, దేవ స్వరూప, నుస్రత్‌, సుభాష్‌, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ముథోల్‌ : మండల కేంద్రంలోని నయాబాదీ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు ఔజేకర్‌ ప్రకాశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

కడెం:  తహసీల్‌ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎంఏ కలీం, నాయబ్‌ తహసీల్దార్‌ వడ్డీ గంగాధర్‌, ఆర్‌ఐలు, వీఆర్‌వోలు, వీఆర్‌ఏలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

దిలావర్‌పూర్‌ : మండలంలోని గుండంపల్లీ జిల్లా  పరిషత్‌ సెకండరీ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఎన్‌సీసీ ప్రోగాం అధికారి విజయ్‌కుమార్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శంకర్‌, ఉపాధ్యాయులు రాజారాం, వెంకట్‌రెడ్డి విద్యార్థులు పాల్గొన్నారు.logo