బుధవారం 20 జనవరి 2021
Nirmal - Nov 27, 2020 , 22:50:39

రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి

రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలి

  • భైంసా సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య
  • సిద్ధార్థ నగర్‌లో న్యాయవిజ్ఞాన సదస్సు 

భైంసా: ప్రతి పౌరుడూ భారత రాజ్యాంగంపై అవగాహన పెంచుకోవాలని భైంసా సివిల్‌ కోర్టు న్యాయమూర్తి ఈశ్వరయ్య అన్నారు. పట్టణంలోని సిద్ధార్థనగర్‌లో గురువారం న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి వ్యక్తికీ జీవించే హక్కు, సమానత్వపు హక్కు ఎంతో కీలకమైందని వాటికి భంగం కలిగినప్పుడు లీగల్‌ సెల్‌ను  సంప్రదించవచ్చునన్నారు. నేటి సాంకేతిక పరిజ్ఞానాన్ని యువత విజ్ఞానాన్ని పెంచుకునేందుకు వినియోగించాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు వినియోగించరాదన్నారు.  డీఎస్పీ నర్సింగ్‌రావు, పట్ట ణ సీఐ వేణుగోపాల్‌ రావు, నాయకులు మైసేకర్‌ సాయిలు, గంగాధర్‌, న్యాయవాదులు ప్రసన్నజిత్‌ ఆగ్రే, దేవిదాస్‌ అ స్డే తదితరులున్నారు.  

ఎదులాపురం:  ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి శక్తివంతమైనదని ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్‌ నాందేవ్‌ కాంబ్లే అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయి వైకుంఠ ట్రస్ట్‌ లో ఘనంగా రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మ న్‌ నాందేవ్‌ కాంబ్లే, సాయి వైకుంఠ ట్రస్ట్‌ చైర్మన్‌, సినీ నిర్మాత, ప్రముఖ హోమియోపతి వైద్యుడు రవికిరణ్‌ యాదవ్‌  మాట్లాడుతూ.. రాజ్యాంగంపై ప్రతి ఒక్కరూ అవగాహ న కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో స్వేరోస్‌ జిల్లా అధ్యక్షుడు పెంటపర్తి ఊశన్న, టీజీపీఏ జిల్లా అధ్యక్షుడు అ స్తక్‌ సుభాష్‌,  సభ్యులు ఉన్నారు.

పోలీస్‌ కార్యాలయంలో..

జిల్లా పోలీస్‌ ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా అంబేద్కర్‌ చిత్రప టానికి పూలమాల వేసి నివాళులర్పించారు.   ఓఎస్డీ ఎం. రాజేశ్‌ చంద్ర మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం ప్రజాసేవకు పునరంకితం కావాలన్నారు.  కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్‌. శ్రీనివాసరావు,  ఏఆర్‌ అదనపు  ఎస్పీ బీ వినోద్‌ కుమార్‌, డీఎస్పీ సయ్యద్‌ సుజా ఉద్దీన్‌, కార్యాలయ ఏవో మహ్మద్‌ యూసున్‌ అలీ, సెక్షన్‌ అధికారులు,ఉద్యోగులు ఉన్నారు


logo