మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Nov 26, 2020 , 00:47:38

లక్ష్యం మేరకు రుణాలందించాలి

లక్ష్యం మేరకు రుణాలందించాలి

  • నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌: జిల్లాలో లక్ష్యం మేరకు వివిధ శాఖల ద్వారా రుణాలు అందించాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్‌ కలెక్టర్‌ కార్యాలయంలో బ్యాంకర్లు, వివి ధ శాఖల అధికారులతో రుణ ప్రణాళికపై బుధవారం ఆ యన సమీక్ష నిర్వహించారు. 2020-21 సంవత్సరానికిగాను ఇప్పటివరకు అందించిన రుణాలు, పెండింగ్‌ రుణాలను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకర్ల వారీగా యూనిట్ల లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు. మార్చి 31 వరకు వందశాతం రుణ ప్రణాళికను అమలు చేయాలన్నారు. రు ణ ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హరికృష్ణ, డీఆర్‌డీవో వెంకటేశ్వర్లు, వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్‌, ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బా బు, అధికారులు రాజలింగం, కిషన్‌యాదవ్‌, స్రవంతి పాల్గొన్నారు. 

జిల్లాలో మైనార్టీ గురుకుల సంక్షేమ పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు సక్రమంగా జరిగేలా చూడాలని కలెక్ట ర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో మైనార్టీ గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధికారులతో సమావేశం నిర్వహించారు. పదోతరగతి విద్యార్థులు నష్టపోకుండా ఆన్‌లైన్‌ తరగతులను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాలు  అందేలా చూడాలన్నారు.  మైనార్టీ సంక్షేమశాఖ అధికారి స్రవంతి, ప్రిన్సిపాల్స్‌ పాల్గొన్నారు. 

పౌష్టికాహారం అందించాలి..

జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులకు, పిల్లలకు పౌ ష్టికాహారం అందేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయంలో శిశు సంక్షేమశాఖ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. సిబ్బందికి పలు సూచనలు చేశా రు. ఇన్‌చార్జి అధికారి స్రవంతి, సీడీపీవోలు సరిత, నాగ లక్ష్మి, కేసరి, మైనార్టీ కళాశాల ప్రిన్సిపాళ్లు మహేశ్‌, షౌకత్‌ఖాన్‌, సలీమొద్దీన్‌, సంగీత, తదితరులు పాల్గొన్నారు.