జీహెచ్ఎంసీలో మంత్రి అల్లోల ప్రచారం

నిర్మల్ అర్బన్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో బంజారాహిల్స్ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి విజయలక్ష్మికి మద్దతుగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సోమవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించిందన్నారు. ప్రతి హామీని కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈసందర్భంగాపార్టీ సీనియర్ నాయకులకు ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పొందుతున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తోడ్పాటు అందించే విధంగా సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించారని కొని యాడారు. ధోబీఘాట్లు, లాండ్రి షాపులు, సె లూన్లకు డిసెంబర్ నుంచి ఉచిత కరెంట్ ఇస్తా మని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికే నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, మరింత అభివృద్ది చేసుకునేలా ప్రణాళికలు రూపొందించారని తెలిపారు
తాజావార్తలు
- ఆ సీక్రెట్ ప్లేస్‌ను.. పసిగట్టలేకపోయారు
- ప్రాణాలు తీసిన పతంగులు
- ఇప్పుడుభూమి కొంటే పరిహారానికి అనర్హులు
- తిరుగు ప్రయాణానికీ రైళ్లు, బస్సులు
- కల్యాణ వైభోగమే..
- టీకా.. వేశాక అరగంట అక్కడే
- మీటర్లు రిపేర్లు ఉంటే బాగు చేసుకోవాలి..
- శిల్పారామంలో సంక్రాంతి సందడి
- వారం పాటు ఖైరతాబాద్ రైల్వే గేటు మూసివేత
- వైభవంగా మల్లన్న స్వామి ఉత్సవాలు