శనివారం 28 నవంబర్ 2020
Nirmal - Nov 22, 2020 , 00:37:17

జీహెచ్‌ఎంసీలో మంత్రి అల్లోల ప్రచారం

జీహెచ్‌ఎంసీలో మంత్రి అల్లోల ప్రచారం

నిర్మల్‌ అర్బన్‌  :  జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు, కే కేశవరావు, జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం ప్రచారం చేశారు. బంజారాహిల్స్‌లోని 93వ  డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గద్వాల్‌ విజయలక్ష్మిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, కౌన్సిలర్లు సంపంగి రవి,మ లక్కాకుల నరహరి, నాయకులు గోవర్ధన్‌ రెడ్డి, మహేశ్‌ రెడ్డి, నర్సాగౌడ్‌, అడ్ప పొశెట్టి తదితరులున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌ అభివృద్ధికి టీఆర్‌ఎస్‌ చేసిన కృషిని ప్రజలకు వివరించాలని మంత్రి అల్లోల, ఎంపీ కేశవరావు దిలావర్‌పూర్‌ మండల నాయకులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కొమ్ముల దేవేందర్‌రెడ్డి, రైతుబంధు సమితి  జిల్లా సభ్యుడు ఏలాల చిన్నారెడ్డి,  రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కోడే రాజేశ్వర్‌, ఎంపీటీసీలు పాల్దె అనిల్‌, శ్రీనివాస్‌, పూజారం మహేశ్‌, తప్పల రవి, అరుణ్‌, సర్పంచ్‌ రాంరెడ్డి, నాయకులు ఉన్నారు.