Nirmal
- Nov 22, 2020 , 00:30:34
నిర్మల్ ఎఫ్‌డీవోగా సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ బాధ్యతల స్వీకరణ

నిర్మల్ అర్బన్ : నిర్మల్ ఎఫ్‌డీవో (ఫారెస్ట్ డివిజన్ అధికారి)గా సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో నిర్మల్ ఎఫ్‌డీవోగా విధులు నిర్వహించిన గోపాల్ బదిలీపై వెళ్లారు. ఆయన స్థానంలో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ విధుల్లో చేరారు. ఆయనకు ఎఫ్‌ఎస్‌వోలు,ఎఫ్‌బీవో పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం జిల్లా అటవీ శాఖ అధికారి సుధాన్ను మర్యాద పూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING