చెరువు నిండింది.. పంట పండింది

- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిండుగా చెరువులు
- ఆయకట్టులో పెద్ద ఎత్తున సాగు
- దండిగా ధాన్యం, ఇతర పంటల దిగుబడి
- 2,702 చెరువుల్లో.. 100 శాతం నిండినవి 2,360
- 3,01,788 ఎకరాలకు 2,23,540 ఎకరాల సాగు
ఈ యేడాది వర్షాలు సమృద్ధిగా కురిశాయి. ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. చెరువుల కింద ఆయకట్టు భారీగా పెరిగింది. పంటల దిగుబడి కూడా వండిగా వస్తున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2,702 చెరువులు ఉండగా.. వీటిలో 2,360 పూర్తిస్థాయిలో నిండాయి. దీంతో పంటలకు నీటి సమస్య లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ చెరువుల కింద 3,01,788 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించగా.. ఇందులో 2,23,540 ఎకరాలు సాగయ్యాయి. ఈ లెక్కన చెరువుల కింద స్థిరీకరించిన ఆయకట్టులో నాలుగింటా మూడొంతులు సాగైంది.
- నిర్మల్, నమస్తే తెలంగాణ
నీళ్లకు రంది లేకుంటైంది..
మా ఊరిలో పెద్ద చెరువు ఉంది. ఒకప్పుడు దీనిని పట్టించుకున్నోళ్లే లేరు. పూడిక పేరుకపోయి నీళ్లుండేటివి కావు. ఎండాకాలం పంటకు మస్తు తిప్పలయ్యేది. నీళ్లు అందుతయో.. లేదోనని.. మస్తు మంది అసలు పంటలే వేసుకునేటోళ్లు కాదు. తెలంగాణ వచ్చినంక కేసీఆర్ సీఎం అయినంక రూ. 77 లక్షలతో చెరువును మంచిగ చేయించిన్రు. ఇప్పుడు 350 ఎకరాలకు నీళ్లందుతున్నయి. నాకు కూడా ఈ చెరువు కింద ఐదెకరాల పొలం ఉంది. నీళ్లకు రంది లేకుంటైంది. యేటా రెండు పంటలు వేసుకుంటున్నం. ఒకప్పుడు పంటలు పండక రైతులు వేరే ఊర్లకు కూలీ పనులకు పోయేటోళ్లు. ఇప్పుడు చేతినిండా పని దొరుకుతుంది. అందరూ ఆనందంగా ఉంటున్నరు. ఇదంతా సీఎం కేసీఆర్ సార్ వల్లే. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటం.
- సాగి పెద్ద లక్ష్మణ్‌రావు, రైతు, బీర్నంది (ఖానాపూర్)
నిర్మల్, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2,702 చెరువులు ఉండగా.. వీటి కింది 3,01,788 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఈ ఏడాది వానకాలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,613 చెరువుల కింద 2,23, 540 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. స్థిరీకరించిన ఆయకట్టులో మూడొంతుల ఆయకట్టుకు సాగునీరు అందింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ చెరువుల కింద 73.74 శాతం మేర ఆయకట్టుకు సాగు నీరు లభించింది. దీంతో పెద్ద ఎత్తున పంటలు సాగవగా.. రైతుల ఇంటా సిరుల పంట పండింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో చెరువుల కింద పెద్ద ఎత్తున వరి సాగవగా.. ఆసిఫాబాద్ జిల్లాలో కొంత మేర వరి వేశారు. ఇక ఆదిలాబాద్ జిల్లాలో పత్తి, శనగ పంటలకు చెరువుల కింద నీటిని విడుదల చేస్తారు. నిర్మల్ జిల్లాలో సుమారు 1.50 లక్షలు, మంచిర్యాలలో 1.63 లక్షలు, ఆసిఫాబాద్‌లో 60 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. నిర్మల్ జిల్లాలో 1.50 లక్ష లు, మంచిర్యాలలో 1.60 లక్షలు, ఆసిఫాబాద్‌లో 90 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సెప్టెంబర్ నెల తర్వాత పత్తి పంటకు సాగునీరు అందించడంతో.. దిగుబడి పెరుగుతున్నది.
విస్తారంగా వర్షాలు
ఈ ఏడాది వానకాలంలో వర్షాలు విస్తారంగా కురియడంతో చెరువులు, కుంటలు నిండుగా మారాయి. చాలా చోట్ల అలుగులు, మత్తడి దూకాయి. ఉమ్మడి జిల్లాలో 2,702 చెరువులకు నాలుగింటా మూడొంతుల చెరువులు పూర్తి స్థాయిలో నిండాయి. ఉమ్మడి జిల్లాలో 2360 చెరువులు 75-100 శాతం నీరు వచ్చి చేరింది. 320 చెరువుల్లోకి 50-75 శాతం నీరు చేరగా.. 22 చెరువుల్లో 25-50 శాతం నీరు వచ్చి చేరింది. దీంతో వానకాలం సీజన్లో చెరువుల కింద ఆయకట్టుకు ఢోకా లేకుండా పోయింది. ఉమ్మడి జిల్లాలో 2,702 చెరువులు ఉండగా.. వీటి కింద 3,01,788 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. ఈ ఏడాది వానకాలంలో ఉమ్మడి జిల్లా పరిధిలోని 2,613 చెరువుల కింద 2,23,540 ఎకరాల్లో వివిధ పంటలు వేశారు. 100 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులు 668 ఉండగా.. వీటి కింద 2,35,963 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. ఇందులో 654 చెరువుల కింద 1,30,655 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందింది. 100 ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 2,034 చెరువులు ఉండగా.. వీటి కింద 65,824 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించారు. ఇందులో 1959 చెరువుల కింద 92,885 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందింది.
నిండుకుండలా ‘పీపీరావు’
దహెగాం : ఇది పీపీరావు ప్రాజెక్టు. ఎర్రవాగు,నల్లవాగులపై కల్వాడ సమీపంలో దీనిని నిర్మించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ మంచిర్యాల జిల్లాలో ఉన్నప్పటికీ ఆయకట్టు మాత్రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలో ఉన్నది. ప్రాజెక్ట్ శిఖం 1000 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. నీటి నిల్వ సామర్థ్యం 84 టీఎంసీలు. ప్రస్తుతం 83 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గతంలో నీరు లేక వెలవెల బోయిన ఈ ప్రాజెక్టు.. ప్రస్తుతం మత్తడి దుంకుతున్నది. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం మెట్‌పల్లితో పాటు దహెగాం మండలంలోని కల్వాడ, కొంచవెల్లి, పీకలగుండం, చంద్రపల్లి, బహ్మన్నగర్, బహ్మన్చిచ్చాల గ్రామాల్లో 5 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. సుమారుగా 1500 మంది రైతులకు ఇది వరప్రదాయనిగా మారింది. నీరు పుష్కలంగా ఉండడంతో యేటా రెండు పంటలు సాగు చేసుకుంటూ ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నారు.
ఆయకట్టుకు భరోసా చందారం చెరువు
లక్షెట్టిపేట : ఇది చందారం చెరువు. దీని విస్తీర్ణం 16 ఎకరాలు. దీని కింద 120 ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో చెరువులో నీరుండేది కాదు. వానకాలం పంట మాత్రమే పండేది. తెలంగాణ ఏర్పడి టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గూడెం లిఫ్ట్ ద్వారా చెరువును నింపుతున్నారు. ప్రస్తుతం ఈ చెరువు నిండా నీళ్లుంటున్నాయి. సుమారు 60 మంది రైతులు యేటా రెండు రెండు సాగు చేసుకుంటున్నారు. ప్రతి పంటకు సుమారుగా 3360 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. రూ. 60 లక్షలకు పైగా ఆదాయం పొందుతున్నారు.
మళ్లో పంట వేస్తున్నం
ఖానాపూర్ : మా ఊరి శివారులో చింతల చెరువు ఉంది. దీనికింద 150 ఎకరాలు సాగవుతున్నయి. సర్కారోళ్లు మిషన్ కాకతీయ కింద చెరువును మంచిగ చేయించిన్రు. సరస్వతీ కాలువ ద్వారా నీళ్లత్తన్నయి. ఎప్పుడూ చెరువునిండే ఉంటుంది. ఇగ పంటలకు రంది లేదు. అందరు సంబురంగా పంటలు వేసుకుంటున్రు. ఈ చెరువు కింద పావుదక్క మూడెకరాల భూమి ఉంది. మొన్న పంట తీసిన. మళ్లో పంట వేయడానికి రెడీ అయితన్నం. సీఎం కేసీఆర్ దయవల్ల మేమందరం సంతోషంగా ఉన్నం.
- బోరువొంతల వెంకటరాజం, రైతు, తర్లాపాడు
సాగుకు ఢోకా లేదు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నితీర్ల మేలు చేస్తున్నది. చెరువులను మంచిగ చేయడంతో వానలకు అవి పూర్తిగా నిండినయ్. 24 గంటల కరెంట్‌తో పంటలకు ఢోకా లేకుంటైంది. ఒకప్పుడు ఎవుసం చేయాల్నంటేనే మస్తు తిప్పలయ్యేది. అప్పుల కోసం సావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లం. ఇప్పుడు సీఎం కేసీఆర్ దయవల్ల మా బతుకులు మొత్తం మారిపోయినయ్. ఎకరానికి రూ. 6 వేల పెట్టుబడి సాయం చేత్తన్రు. ఎవ్వలకు చేయి చాపాల్సిన అవసరం లేకుంటైంది. ఎలాంటి ఇబ్బందుల్లేకుంట పంటలు వేసుకొని సంతోషంగా ఉంటున్నం.
- నిండుగూరి రాజయ్య, అదిల్‌పేట, మందమర్రి మండలం
మళ్లో పంట వేస్తున్నం
ఖానాపూర్ : మా ఊరి శివారులో చింతల చెరువు ఉంది. దీనికింద 150 ఎకరాలు సాగవుతున్నయి. సర్కారోళ్లు మిషన్ కాకతీయ కింద చెరువును మంచిగ చేయించిన్రు. సరస్వతీ కాలువ ద్వారా నీళ్లత్తన్నయి. ఎప్పుడూ చెరువునిండే ఉంటుంది. ఇగ పంటలకు రంది లేదు. అందరు సంబురంగా పంటలు వేసుకుంటున్రు. ఈ చెరువు కింద పావుదక్క మూడెకరాల భూమి ఉంది. మొన్న పంట తీసిన. మళ్లో పంట వేయడానికి రెడీ అయితన్నం. సీఎం కేసీఆర్ దయవల్ల మేమందరం సంతోషంగా ఉన్నం.
- బోరువొంతల వెంకటరాజం, రైతు, తర్లాపాడు
సాగుకు ఢోకా లేదు
తెలంగాణ ప్రభుత్వం రైతులకు అన్నితీర్ల మేలు చేస్తున్నది. చెరువులను మంచిగ చేయడంతో వానలకు అవి పూర్తిగా నిండినయ్. 24 గంటల కరెంట్‌తో పంటలకు ఢోకా లేకుంటైంది. ఒకప్పుడు ఎవుసం చేయాల్నంటేనే మస్తు తిప్పలయ్యేది. అప్పుల కోసం సావుకార్ల చుట్టూ తిరిగేటోళ్లం. ఇప్పుడు సీఎం కేసీఆర్ దయవల్ల మా బతుకులు మొత్తం మారిపోయినయ్. ఎకరానికి రూ. 6 వేల పెట్టుబడి సాయం చేత్తన్రు. ఎవ్వలకు చేయి చాపాల్సిన అవసరం లేకుంటైంది. ఎలాంటి ఇబ్బందుల్లేకుంట పంటలు వేసుకొని సంతోషంగా ఉంటున్నం.
- నిండుగూరి రాజయ్య, అదిల్‌పేట, మందమర్రి మండలం
తాజావార్తలు
- 223 ఫీల్డ్ రెజిమెంట్‌తో గన్ సెల్యూట్
- ప్రగతి భవన్లో జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
- కేటీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- మోదీ పగిడీ.. ఇదీ ప్రత్యేకత
- నమస్తే తెలంగాణ ఆఫీసులో గణతంత్ర వేడుకలు
- జాతీయ యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళి
- 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన చిరు
- మీ 'టిప్' కో దండం సారూ...!
- ప్రధాని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- బారికేడ్లను బ్రేక్ చేసిన అన్నదాతలు.. వీడియో