గురువారం 28 జనవరి 2021
Nirmal - Nov 21, 2020 , 02:00:48

చేతినిండా ‘ఉపాధి’

చేతినిండా ‘ఉపాధి’

  • ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో జోరుగా పనులు

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2020-2021 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పనులు జోరుగా సాగుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పల్లెల్లో వివిధ రకాల పనులు చేపడుతున్నాయి. మార్చి మూడో వారం నుంచి కరోనా ప్రభావం ఉండగా, ఆ సమయంలో కూలీలకు చేతినిండా పని కల్పించాయి. 3,42,503 కుటుంబాల్లోని 6,31,637 మందికి ఉపాధి చూపించాయి. ఇప్పటి వరకు 431.81 కోట్లు వెచ్చించింది. 60 శాతం కూలీలకు, 40 శాతం మెటీరియల్‌ కంపొనెంట్‌లో భాగంగా చేపట్టే పనులకు నిధులు కేటాయించాల్సి ఉంది. మెటీరియల్‌ కంపొనెంట్‌ కింద వచ్చే బిల్లులు కేంద్రం నుంచి రాకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. 


 నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 1508 గ్రామ పంచాయతీలుండగా, వీటి పరిధిలోని గ్రామాలు, ఆవాసాల్లో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వివిధ రకాల పనులు, నిర్మాణాలు చేపడుతున్నారు. గ్రామాల్లో కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద వివిధ రకాల పనులు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో వివిధ రకాల పనులు, నిర్మాణాలు చేస్తుండగా.. కరోనా సమయంలో ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున కూలీలకు ఉపాధి కల్పించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో మొత్తం 556768 కుటుంబాలకు జాబ్‌కార్డులు జారీ చేయగా.. ఇందులో 1190987మంది కూలీలు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం (2020-2021)లో ఇప్పటి వరకు 3,42, 503 కుటుంబాల్లోని 6,31,637మంది కూలీలకు ఉపాధి చూపించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ. 4 31.81 కోట్ల మేర నిధులు వెచ్చించారు. ఇందులో తప్పనిసరిగా 60 శాతం తగ్గకుండా నిధులను కూలీల ఉపాధి కో సం వెచ్చించాల్సి ఉండగా, 40 శాతం మించకుండా మెటీరియల్‌ పనులకు వెచ్చించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వ రకు రూ.292.04 కోట్లు కూలీల ఉపాధి కోసం వె చ్చించా రు. ఉమ్మడి జిల్లాలో సగటున 69.71శాతం నిధులను కూలీలకు చెల్లించారు. ఇక రూ.124.04 కోట్లను మెటీరియల్‌ పనులకు వెచ్చించగా, సగటున 30.29శాతం మేర ఖర్చు చేశారు. పథ కం నిర్వహణ ఖర్చుల కింద రూ.14.94కోట్లు వెచ్చించారు.

ఆదుకున్న ‘ఉపాధి’..

ఉపాధి హమీ పథకం కరోనా సమయంలో కూలీలను ఆదుకుంది. పట్టణాలు, నగరాల్లో చిరు ఉద్యోగులు పల్లెబాట పట్టా రు. గ్రామంలో ఉండేవారితో పాటు ఇతర ప్రాంతాల నుంచి తిరిగి వచ్చిన వారు కూడా ఉపాధి పనులకు వెళ్లారు. ఈ ఏడా ది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులు పెద్ద ఎత్తున చేపట్టగా.. కూలీలకు చేతినిండా పని దొరికింది. ఉమ్మడి జిల్లాలో ఉపాధి కూలీలకు రూ.292.04 కోట్ల డబ్బులను చెల్లించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2,34,30,000 పని దినాలు పూర్తి చే యాలనే లక్ష్యంకాగా, ఇప్పటి వరకు 1,59,30,151 పని దినాలు కల్పించారు. నిర్దేశించిన లక్ష్యంలో ఉమ్మడి జిల్లాలో సగటున 66.93 శాతం పనులు కల్పించారు. ప్రతి కుటుంబానికీ సగటున 44.56 రోజుల పాటు ఉపాధి చూపించారు. ప్రతి కూలీకీ రోజుకు సగటున రూ.188.09 చొప్పున కూలీ డబ్బు లు చెల్లించారు. ఇక ఉమ్మడి జిల్లాలో 18,593 కుటుంబాలకు 100 రోజుల పాటు ఉపాధి చూపించారు. కరోనా సమయం లో గ్రామాల్లో సామాజిక దూరం పాటిస్తూ.. మాస్కులు వేసుకుని ఉపాధి పనులకు వెళ్లారు. ఉపాధి పనులు పెద్ద ఎత్తున చేపట్టడంతో.. కరోనా వేళ ఉపాధి కూలీలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా పోయాయి. 

బిల్లులు మంజూరు కాక..

ఉపాధి హామీ పథకంలో భాగంగా 60 శాతం నిధులను కూలీలకు వెచ్చిస్తే.. మిగతా 40 శాతం నిధులను మెటీరియల్‌ పనులకు వెచ్చించే వెసులుబాటు కల్పించారు. ఇక మెటీరియల్‌ కాంపోనెంట్‌లో భాగంగా చేపట్టే పనులకు సంబంధించిన నిధుల్లో కేంద్ర ప్రభుత్వం 75శాతం, రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం చొప్పున భరిస్తోంది. ఉమ్మడి జిల్లాలో 1508గ్రామ పం చాయతీలు ఉండగా.. అన్ని చోట్ల శ్మశాన వాటికలు, రైతు వేదికలు, డంప్‌ యార్డులు, ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, ఇం కుడు గుంతలతో పాటు సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడుతున్నా రు. వీటిని గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద వచ్చే నిధులతో చేపడుతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో వీటి నిర్మాణం చేస్తుండగా.. సకాలంలో కేంద్రం నుంచి నిధులు రావడం లేదు. రైతు వేదికలకు రూ.10లక్షల చొప్పున ఉపాధి నిధులు ఇస్తుండగా.. ఉమ్మడి జిల్లాలో 305 క్లస్టర్లలో వీటి నిర్మాణం చేపట్టారు. ఇవి దాదాపు అన్ని చోట్ల నిర్మాణం పూర్తికాగా, బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 1508గ్రామ పం చాయతీల్లో డంప్‌ యార్డులు, శ్మ శాన వాటికలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, సీసీ రోడ్లు నిర్మించగా.. చా లా చోట్ల గత ఆరేడు నెలలుగా బిల్లులు మంజూరుకాక.. తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

ప్రతిరోజూ పనికి వెళ్లిన..

నిర్మల్‌ టౌన్‌ :   నా పేరు కాపు కు మ్మరి సంతోష్‌. మా ఊరు వెంగ్వాపేట్‌. మాకు మూడెకరాల వ్యవసాయ భూమి ఉంది. డిసెంబర్‌లో వరి సాగు చేయగా పంట చేతికొచ్చింది. మార్చి తర్వాత పనులు లేవు. అప్పుడే ఉపాధి హామీ పని ప్రారంభమైంది. గ్రామంలో చాలా మంది ఉపాధి పనులకు వెళ్తుండంతో నేను కూడా నెలరోజులు ఉపాధి పనికి  పోయిన. వారానికి రూ. 1000 చొప్పున నెలకు రూ. 4వేల డబ్బులు ఖాతాల్లో జమయ్యాయి. ఆ డబ్బులతో ఇంటి అవసరాలు తీరాయి. జీవితంలో మొట్టమొదటిసారి వేసవిలో పని లేని సమయంలో రూ. 4వేల అదనపు ఆదాయం వచ్చినందుకు సంతోషం అనిపించింది.

పని దొరుకుతున్నది.. 

నిర్మల్‌ టౌన్‌ :  నా పేరు లెంక రాకేశ్‌. మాది వెంగ్వాపేట్‌ గ్రా మం.  వేసవిలో వ్యవసాయ పనులు మొత్తం పూర్త య్యా యి. తర్వాత ఉపాధిహామీ పనులు చేపట్టారు. దీంతో ప్రతిరోజూ మిత్రులతో కలిసి గ్రూపుగా ఏర్పడి పనికి వెళ్లాను. అంతకుముందు రెండేళ్లు జాబ్‌కార్డు తీసుకోవాలని అనుకున్నా వీలు కాలేదు. రెండు నెలలు ఉపాధిహామీ పనులకు వెళ్లి రూ. 8 వేలు సంపాదించాను. logo