శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Nov 20, 2020 , 01:13:04

‘108’లో ప్రసవం తల్లీబిడ్డ క్షేమం

‘108’లో ప్రసవం తల్లీబిడ్డ క్షేమం

సారంగాపూర్‌: మండలంలోని కుఫ్టి గ్రామాని కి చెందిన జాదవ్‌ అశ్వినీ అంబులెన్స్‌లో ప్రసవించింది. మగబిడ్డకు జన్మనిచ్చింది. అశ్వినీకి గురు వారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో సారంగాపూర్‌ దవాఖానలోని 108 అంబులెన్స్‌ కు కుటుంబ సభ్యులు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. వెంటనే అంబులెన్స్‌ గ్రామానికి చే రుకుంది. అశ్వినీని పరీక్షించి, దవాఖానకు తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు ఎక్కువ య్యాయి. దీంతో ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ సాగర్‌, పైలట్‌ లక్ష్మణ్‌ అంబులెన్స్‌ను నిలిపి,  సా ధారణ కాన్పు చేశారు.   అంబులెన్స్‌ సిబ్బంది, ఏ ఎన్‌ఎంను కుటుంబ సభ్యులు అభినందించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నట్లు సిబ్బంది తెలిపారు.


logo