నిర్మల్ అభివృద్ధే ధ్యేయం

- వేగంగా కొనసాగుతున్న పనులు
- కోట్ల రూపాయల నిధులు..
- రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
- పట్టణంలో మెటల్, సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ
నిర్మల్ అర్బన్ : నిర్మల్ జిల్లా అభివృద్ధే ధ్యేయం గా ముందుకెళ్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని శాస్త్రినగర్ కాలనీలో రూ.7 లక్షలతో నిర్మించే మెటల్ రోడ్డు, సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కోట్ల రూపాయల నిధులతో కొనసాగుతున్న పనుల వల్ల జిల్లా కేం ద్రం అభివృద్ధి చెందుతున్నదన్నారు. ఇప్పటికే చైన్‌గేట్ నుంచి జంగల్పేట్ వరకు అంతర్గత రోడ్డు పనులు వేగంగా సాగుతుండడంతో పట్టణ రూపురేఖలు మారిపోతున్నాయని పేర్కొన్నారు.
మున్సిపల్ నిధులతో 42 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వార్డుల్లో పనులు సాగుతుండగా, మరికొన్ని చోట్ల త్వరలోనే ప్రారంభిస్తామన్నారు. నిర్మల్ పట్టణాన్ని విద్యుత్ వెలుగులతో నింపేందుకు 14 జంక్షన్లలో హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ప్రారంభించినట్లు, రెండుమూడురోజుల్లో మిగితా చోట్ల కూడా పూర్తిచేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ప్రముఖ పారిశ్రామికవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి, ఎఫ్ఎస్సీఎస్ మాజీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ రామగౌని తులసి నర్సాగౌడ్, నాయకులు సంపంగి రవి కుమార్, లక్కాకుల నరహరి, మున్సిపల్ కమిషనర్ ఎన్ బాలకృష్ణ, ఏఈ వినయ్ కుమార్, మాజీ కౌన్సిలర్ నూతుల భూపతిరెడ్డి, కాలనీవాసులు తిరుమల రావు, చిలువేరి గంగాధర్ పాల్గొన్నారు.
శాంతినగర్‌లో..
పట్టణంలోని శాంతినగర్‌కాలనీలో రూ.7.50 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులకు మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ప్రముఖ వ్యాపారవేత్త అల్లోల మురళీధర్ రెడ్డి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో నాయకులు జొన్నల మహేష్, నడికట్ల మహేష్ యాదవ్, సత్యం, సాయికృష్ణ , అడ్ప పోశెట్టి తదితరులున్నారు.
ఎల్వోసీ అందజేసిన మంత్రి అల్లోల..
మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన పైడిమర్రి సాగర్ అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఆయన ఆర్థిక పరిస్థితిని ప్రజాప్రతినిధుల ద్వారా తెలుసుకున్న మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి.. సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షలను మంజూరు చేయించారు. సంబంధిత చెక్కును సాగర్ భార్య మమతకు మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ప్రధానకార్యదర్శి వికాస్ రెడ్డి తదితరులున్నారు.
తాజావార్తలు
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
- అత్యద్భుత సిరీస్ విజయాల్లో ఇదీ ఒకటి: సచిన్
- టీమిండియా విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు
- రకుల్ జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
- రిషబ్ పంత్ సూపర్ షో..
- ఆస్ట్రేలియాను మట్టి కరిపించిన టీమిండియా
- కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ డిశ్చార్జి