గురువారం 21 జనవరి 2021
Nirmal - Nov 18, 2020 , 02:31:29

ఆన్‌లైన్‌ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆన్‌లైన్‌ పాఠాలను సద్వినియోగం చేసుకోవాలి

  • ఆదిలాబాద్‌ డీఈవో రవీందర్‌రెడ్డి

ఇచ్చోడ : కరోనా నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ తరగతులను విద్యార్థులందరూ సద్విని యోగం చేసుకోవాలని ఆదిలాబాద్‌ జిల్లా విద్యాధికారి రవీందర్‌ రెడ్డి సూచించారు. ఇచ్చోడలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను మంగళవారం డీఈవో, సెక్టోరల్‌ అధికారి కే నర్సయ్య సందర్శించారు. విద్యార్థులకు సంబంధించిన రోజువారీ ఉపాధ్యాయుల పర్యవేక్షణ డైరీలను పరిశీలించారు. ఆన్‌లైన్‌ బోధనా విధానంపై ఉపాధ్యాయులకు తగిన సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మండలంలోని ముక్రా (కే), ముక్రా (బీ), అడెగామ (కే)లోని ఎస్సీ కాలనీలో ఆన్‌లైన్‌ తరగతుల ద్వారా విద్యార్థులు నేర్చుకుంటున్న అంశాల తీరును పరిశీలించారు. ఆన్‌లైన్‌ పాఠ్యాంశ బోధనపై విద్యార్థులకు ఆంగ్ల పుస్తకాన్ని చదివించి తగు మార్గదర్శకం చేశారు. ఆన్‌లైన్‌ క్లాస్‌లు సులభంగా అర్థమవుతున్నాయని విద్యార్థులు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి రాథోడ్‌ ఉదయ్‌రావ్‌, చంద్రకాంత్‌, రాథోడ్‌ దీపక్‌, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.  logo