మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Nov 18, 2020 , 02:31:31

బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

  • ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌
  • ‘నమస్తే’ కథానికి స్పందన
  • ఆర్డీవో కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ సస్పెండ్‌

ఎదులాపురం : కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం అమలులో జరిగిన అవకతవకల్లో బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆదిలాబాద్‌ కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘కల్యాణలక్ష్మిలో అక్రమాలు’ అని ‘నమస్తే తెలంగాణ’లో మంగళవారం వచ్చిన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. ఈ మేరకు ఆదిలాబాద్‌ ఆర్డీవో కార్యాలయ (కల్యాణలక్ష్మి సెక్షన్‌) సీనియర్‌ అసిస్టెంట్‌ నదీంను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేశారు. సంబంధి త మండలాల తహసీల్దార్లు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశించారు. అవకతవకల్లో ఇతరులు ఎవరైనా ఉన్నా వారిపైనా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ఇక ముందు ఈ పథకం అమలుకు సంబంధించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని తహసీల్దార్లు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులను ఆదేశించారు.