23 నుంచి వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు

- ఉమ్మడి జిల్లాలో ఎనిమిది చోట్ల కార్యకలాపాలు
- రెండు నెలల తర్వాత పునఃప్రారంభం
- ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
- ‘ధరణి’ పోర్టల్ ద్వారా సేవలు
- ఇప్పటికే ‘వ్యవసాయ’ భూముల రిజిస్ట్రేషన్లు సక్సెస్
- రైతుల నుంచి పెరిగిన ఆదరణ
భూముల రిజిస్ట్రేషన్లలో నవ శకానికి నాంది పలికిన ‘ధరణి’ ఇప్పుడు మరో ముందడుగు వేయబోతున్నది. ఈ పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు సులభతరమైన నేపథ్యంలో, రైతుల నుంచి ఊహించని రీతిలో ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో రెండు నెలలకు పైగా నిలిచిపోయిన వ్యవయసాయేతర భూముల రిజిస్ట్రేషన్లనుమొదలుపెట్టేందుకు రాష్ట్ర సర్కారు సన్నాహాలు చేస్తున్నది. నవంబర్ 2 నుంచి తహసీల్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా,
23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ఆదేశాలు ఇప్పటికే జిల్లాలకు అందగా, ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ సేవలు అందించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారానే ఈ ప్రక్రియ కొనసాగనుండగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు
. -నిర్మల్, నమస్తే తెలంగాణ
నిర్మల్, నమస్తే తెలంగాణ:ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 చోట్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా, ఆదిలాబాద్ జిల్లా కేం ద్రంలో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం (డీఆర్) ఉంది. గతంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, భవనాలు, ప్లాట్లు, వివాహాల రిజిస్ట్రేషన్లు చేసేవారు. ప్రస్తుతం ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మండల కేంద్రాల్లోని తహసీల్ కార్యాలయాల్లో చేస్తున్నారు. వ్య వసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 70 మండలాలు ఉండగా, అన్ని తహసీల్ కార్యాలయాల్లో నవంబర్ 2 నుంచి ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఒక్కో కార్యాలయంలో రోజుకు 10కి మించకుండా స్లాట్ల బుకింగ్‌కు అవకాశం ఇవ్వగా, ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే 2వేలకు పైగా రిజిస్ట్రేషన్లు చేశారు. కా గా, సెప్టెంబర్ 7న రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా, రెండు నెలల అనంతరం వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రకటన చేశారు.
ఉమ్మడి జిల్లాలో 8 చోట్ల..
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 23 నుంచి వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి జిల్లాలో ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ఖానాపూర్, భైంసా, మంచిర్యాల, లక్షెట్టిపేట్, ఆసిఫాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్లు చేస్తారు. ప్లాట్లు, ఇండ్లు, భవనాలు, తదితర రిజిస్ట్రేషన్లు నిర్వహించనున్నారు. గతంలో తెలంగాణ స్టేట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ (టీఎస్ఐజీఆర్ఎస్) పోర్టల్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్లు చేయగా, ఇక ధరణి పోర్టల్ ద్వారా ఈ సేవలు అందించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది.
అరగంటలోనే..
ధరణి పోర్టల్ ద్వారా సులభతర, పారదర్శక సేవలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సేల్‌డీడ్, గిఫ్ట్ డీడ్‌కు ముందు రోజు స్లాట్ బుక్ చేస్తే, మరుసటి రోజున అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌తో పాటు అప్డేషన్ కూడా చేస్తున్నారు. పార్టీషన్, సక్సేషన్‌కు సంబంధించి.. స్లాట్ బుకింగ్ చేసిన ఏడు రోజుల తర్వాత ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. ఈ లోపు ఏవైనా అభ్యంతరాలు వస్తే పరిశీలిస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్ కార్యాలయాల్లో విజయవంతంగా పూర్తవుతున్నాయి. ఈ పోర్టల్ ద్వారా అందుతున్న సేవలతో రైతుల కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియగా, పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తున్నది. కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్ప డం, దళారుల బెడద లేకుండా రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తవుతుండడంతో భూములకు భరోసా దక్కిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ నేపథ్యంలో తొలుత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను గమనించిన సర్కారు, ఇక వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్‌కు అనుమతినిచ్చింది.
తాజావార్తలు
- బైకులు ఢీకొని ఇద్దరికి తీవ్రగాయాలు
- ఎస్పీ బాలసుబ్రమణ్యం కొత్త పాట వైరల్
- ఇక డేటా ఇన్ఫ్రా, కృత్రిమ మేధపైనే ఫోకస్
- ఆదిపురుష్ లాంఛింగ్‌కు టైం ఫిక్స్..!
- పవన్ కల్యాణ్ చిత్రంలో అనసూయ..?
- విద్యార్థినులకు మొబైల్ ఫోన్లు అందించిన మంత్రి కేటీఆర్
- సెస్, సర్ ఛార్జీలను కేంద్రం రద్దు చేయాలి : మంత్రి హరీశ్ రావు
- సంక్రాంతి హిట్‌పై కన్నేసిన సోనూసూద్..?
- ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి
- చిరంజీవిని చూసే అన్నీ నేర్చుకున్నా: హీరో రోహిత్