బుధవారం 27 జనవరి 2021
Nirmal - Nov 14, 2020 , 02:34:53

పన్ను వసూలు చేయండి

పన్ను వసూలు చేయండి

పెంబి: వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని డీఎల్పీవో శ్రీలత అధికారులను ఆదేశించారు. మండలంలోని మందపల్లిలో శుక్రవారం ఆమె పర్యటించారు. ఈ సంద ర్భంగా గ్రామ పంచాయతీ రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ మందపల్లిలో 25 శాతం పన్ను మాత్రమే వసూలైం దని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామ పం చాయతీ పరిధిలో నర్సరీల ఏర్పాటుకు సిద్ధం కావాలన్నారు. త్వరితగతిన నర్సరీ పనులను ప్రారంభించి, నర్సరీకి కావలసి న మట్టిని సేకరించాలని సూచించారు. గ్రా మాల్లో ఎప్పటికప్పుడు చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉం చాలని సూచించారు. ఎంపీవో చిక్యాల రత్నాకర్‌రావ్‌, సర్పంచ్‌ చేర్పురి సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు. 


logo