వెలుగుల కేళీ.. దీపావళి..

- నేడు దీపాల పండుగ
- వేడుకలకు సిద్ధమైన ప్రజలు n ఇంటింటా సందడి
- లక్ష్మీ పూజలు, కేదారీశ్వర వ్రతాలు
- కళకళలాడిన మార్కెట్లు, దుకాణాలు
- కొవిడ్ జాగ్రత్తలు తప్పనిసరి
‘చీకటి’ సర్వ దుఃఖాల చిహ్నం. ‘వెలుగు’ సకల సంతోషాల సంకేతం. కష్టాల్లోనూ సుఖాలను కలుగానాలనే సందేశాన్ని మోసుకుంటూ దీపావళి రానే వచ్చింది. నేటి ‘వెలుగుల’ వేడుకను వైభవంగా జరుపుకునేందుకు జిల్లా ప్రజానీకం సిద్ధమైంది. దివ్వెల వెలుగులు, పటాకుల జిలుగులను చిన్నాపెద్దా తనివితీరా ఆస్వాదించే తరుణం ఆసన్నమైంది.
- మంచిర్యాల కల్చరల్/చెన్నూర్ టౌన్/తాండూర్/నిర్మల్ అర్బన్
మంచిర్యాల కల్చరల్/ చెన్నూర్ టౌన్ / తాండూర్ / నిర్మల్ అర్బన్ : తారాజువ్వలు ఆకాశాన్ని తాకుతుండగా.. చిన్నారుల మో ముల్లో ఆనందం వెల్లివిరుస్తుండగా.. జిల్లా ప్రజలు దీపావళికి స్వాగతం పలుకనున్నారు. చీకటిమయమైన ఇండ్లల్లో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ.. జీవితాల్లో వెలుగులు నింపే పండుగ.. చెడుపై మంచి సాధించిన విజయానికి చి హ్నం.. దీపాల వరుస, దీపాలంకరణ, లక్ష్మీపూజ ఈ పండు గ ప్రత్యేకత. దీపాల కాంతులు, పటాకుల మోత ప్రత్యేక ఆకర్షణగా నిలిచే దీపావళి పండగను ఉమ్మడి జిల్లా ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఘనంగా జరుపుకోనున్నారు. పట్టణాలు, మండల కేంద్రాల్లోని మార్కెట్లు కొనుగోలు దారులతో సందడిగా కనిపిస్తున్నాయి.
దీపం లక్ష్మీ స్వరూపం..
జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సద్గుణ సంపత్తులకు ప్రతీక. మనలోని అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానదీపం వెలిగించి తద్వా రా జగశ్శాంతి చేకూరాలని ప్రార్థిస్తాం. దీపారాధన చేసే ఆనవాయితీ వేలాది సంవత్సరాల నుంచి వస్తున్నది. మహాలక్ష్మీ నూనెలో, నీటిలో ఆశ్వీయుజ బహుళ త్రయోదశి నుంచి కా ర్తీక శుద్ధ విజయ వరకు నివాసముంటుందట. అందుకే ఆ రోజుల్లో ప్రమిదలతో దీపాలను ఇండ్లల్లో అలంకరిస్తారు.
లక్ష్మీపూజలకు ప్రత్యేకత..
దీపావళి పండుగ రోజున లక్ష్మీపూజలు జరుపుకోవడానికి ఒక ప్రత్యేకత ఉంది. దుర్వాసుడనే మహర్షి ఒకసారి ఇంద్రు డి ఆతిథ్యానికి తృప్తి పొంది ఒక మహిమానిత్వమైన హారా న్ని బహూకరిస్తాడు. కానీ ఇంద్రుడు దానిని తిరస్కార భా వంతో తన వాహనమైన ఐరావతం (తెల్ల ఏనుగు) మెడలో వేస్తాడు. అది ఆహారాన్ని కాలితో తొక్కేస్తుంది. దీంతో దు ర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రున్ని శపిస్తాడు. శాప ఫలితంగా రాజ్యాన్ని కోల్పోయి సర్వ సంపదలు పోగొట్టుకున్న ఇంద్రుడు కాపాడాలంటూ శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఒక జ్యోతి ని వెలిగించి దానిని మహాలక్ష్మీ స్వరూపంగా భావించి పూ జిస్తే పోగొట్టుకున్నవన్నీ లభిస్తాయని విష్ణువు చెబుతాడు. విష్ణువు చెప్పినట్లు ఇంద్రుడు పాటించడంతో తృప్తిచెందిన లక్ష్మీదేవి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సకల సంపదలను ఇం ద్రుడికి అప్పగిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో ఇంద్రుడు మహాలక్ష్మీని ‘తల్లీ నీవు ఎప్పుడూ మహావిష్ణువు వద్దనే ఉంటావు కదా.. మరి భక్తులను ఎప్పుడు కనికరిస్తావు’ అని ప్రశ్నిస్తాడు. దీనికి ఆ తల్లి బదులిస్తూ ‘నన్ను త్రికరణ శుద్ధితో ఆరాధించే భక్తులకు, వారి అభిష్టాలకు అనుగుణంగా ప్రసన్నురాలిని అవుతా’నని చెబుతుంది.
కేదారీశ్వర వ్రత నోము ప్రత్యేకం...
దీపావళి పండుగలో కేదారీశ్వర వ్రతానికి ప్రత్యేకస్థానముంది. యేటా ఆశ్వీయుజ బహుళ చతుర్దశి అమావాస్యనాడు కేదారీశ్వర వ్రతం నిర్వహిస్తే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఇక ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కూర్చొని ఉండగా.. భృంగీరిట అనే రుషి వచ్చి పరమేశ్వరుడికి ప్రదక్షిణ చేస్తాడు. అది గమనించిన పార్వతీదేవి ఎందుకు పరమేశ్వరుడొక్కడికే ప్రదక్షిణ చేశారు అని అడుగుతుంది. రుషి బ్రహ్మజ్ఞానం పొందాడని, మహారుషులు చేసే ప్రదక్షిణలు, నమస్కారం పొందవచ్చని చెడుతాడు. అప్పుడు పార్వతీదేవి 18 సార్లు క్రమం తప్పక కేదదారీశ్వర తత్వాన్ని పొందగలిగిందని పురణాలు చెబుతున్నాయి.
మంత్రి దీపావళి శుభాకాంక్షలు
నిర్మల్ అర్బన్ : దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలి పారు. పండుగ ప్రజల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిం పాలని, సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు.
తాజావార్తలు
- ఇదీ మా సత్తా: విరాట్ కోహ్లి
- అక్కడ మంత్రి కావాలంటే ఎన్నికల్లో గెలువాల్సిన పనిలేదు..
- ముంబై, పుణెలో ప్రారంభమైన వ్యాక్సిన్ డ్రైవ్
- చిరంజీవి నన్ను చాలా మెచ్చుకున్నారు..
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్షిప్లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు