శుక్రవారం 22 జనవరి 2021
Nirmal - Nov 12, 2020 , 01:44:52

రద్దీగా తహసీల్‌ కార్యాలయం

రద్దీగా తహసీల్‌ కార్యాలయం

  • ధరణి పోర్టల్‌లో ఇప్పటి వరకు 17 రిజిస్ట్రేషన్లు
  • వేగంగా కొనసాగుతున్న మ్యుటేషన్‌
  • హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు

ఖానాపూర్‌: మండల కేంద్రంలోని తహసీల్‌ కార్యాలయం సాగు భూముల రిజిస్ట్రేషన్లతో  రద్దీగా మారుతున్నది. ధరణి సేవల ద్వారా స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న రైతులు 6వ తేదీ నుంచి వారికి కేటాయించిన తేదీల్లో రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. మధ్యలో ఆదివా రం సెలవుదినం పోను బుధవారం నాటికి ఖా నాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో మొత్తం 17 మంది రైతులు తమ వ్యవసాయ భూము ల విక్రయాలకు సంబంధించి ధరణి సేవల ద్వారా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సగటు న ప్రతి రోజూ మూడు నుంచి ఐదుగురు రైతుల క్రయ విక్రయాలకు సంబంధించి ఇక్క డ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ సంఖ్య రానున్న రోజుల్లో మరింతగా పెరుగుతుందని  తహసీల్దార్‌ ఎర్ర నరేందర్‌ తెలిపారు. చాలా మంది రైతులు వారు కొనుగోలు చేసిన వ్యవసాయ భూములకు సంబంధించి స్లాట్‌ బుకిం గ్‌ చేయించుకున్నారని, వారందరికీ రిజిస్ట్రేషన్‌ తేదీలు కూడా కేటాయించినట్లు వారు పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్‌ కోసం తమ కార్యాలయానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నారు. బుకింగ్‌ చేసుకున్న రైతులకు కేవలం అరగంటలోపే రిజిస్ట్రేషన్‌ చేయడమే గాకుండా ఏకకాలంలో మ్యుటేషన్‌ కాపీని కూడా చేతిలో పెడుతున్నామని తహసీల్దార్‌ అన్నారు. కాగా మస్కాపూర్‌కు చెందిన రైతు ఐనవేని పెద్ద నర్సయ్య తనకు ఉన్న వ్యవసా య భూమిని తన నలుగురు కొడుకులకు  ఐదు గుంటల చొప్పున రిజిస్ట్రేషన్‌ చేసి ఇచ్చారని ఆయన తెలిపారు. 


logo