గురువారం 21 జనవరి 2021
Nirmal - Nov 12, 2020 , 01:39:28

మహనీయుల ఆశయాలు సాధించాలి

మహనీయుల ఆశయాలు సాధించాలి

నిర్మల్‌ అర్బన్‌: యువత మహనీయుల ఆశయాలను సాధించాలని నిర్మల్‌ మున్సిపల్‌ చై ర్మన్‌ గండ్రత్‌ ఈశ్వర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కలాం గుణం సొసైటీ ఆధ్వర్యంలో మౌలానా ఆజాద్‌ జయంతిని బుధవారం నిర్వహించారు. ఆజా ద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సొసైటీ చేస్తున్న సేవలను గుర్తు చేశారు. ఎంఐఎం పార్టీ నాయకులు అజీంబిన్‌ యాహియా, కలాంగుణం సొసైటీ అధ్యక్షుడు మహ్మద్‌ ఉస్మాన్‌, మున్సిపల్‌ కోఆప్షన్‌ సభ్యు డు సయ్యద్‌ మజర్‌ ఉన్నారు.

ఖానాపూర్‌ టౌన్‌: ఖానాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి నిర్వహించారు. పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు నజీర్‌ ఆహ్మద్‌ ఉపాధ్యాయులతో కలసి కలాం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువత కలాంను ఆదర్శంగా తీసుకో వాలని నజీర్‌ ఆహ్మద్‌ సూచించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. విద్యార్థులు వ్యసనాలకు బానిసకాకుండా మంచి ఆలోచనలతో ముందుకు సాగాలని కోరారు.  ఉపాధ్యాయులు ఆసిఫ్‌, శ్రీనివాస్‌, గంగాధర్‌, ఇమ్రాన్‌ ఖాన్‌, బషీర్‌, సుదర్శన్‌, రమణ తదితరులు పాల్గొన్నారు.


తాజావార్తలు


logo