శుక్రవారం 15 జనవరి 2021
Nirmal - Nov 12, 2020 , 01:28:31

‘పట్టణ ప్రగతి’లో వేగం పెంచాలి

‘పట్టణ ప్రగతి’లో వేగం పెంచాలి

  •  నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

  నిర్మల్‌ టౌన్‌ : భైంసా, ఖానాపూర్‌, నిర్మల్‌ మున్సిపాలిటీల్లో చేపట్టిన పట్టణ ప్రగతి పనుల్లో వేగం పెంచాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. పట్టణ ప్రగతి పనులపై కలెక్టరేట్‌లో బుధవారం మున్సిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఆయా మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మున్సిపల్‌ పన్నులను వసూలు చేయాలని నిత్యం పారిశుధ్య  పనులు చేపట్టాలని, మౌలిక వసతులు కల్పించాలన్నారు. పట్టణ పార్కులకు స్థలాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. హరితహారంలో నాటిన మొక్కలకు రక్షణ కల్పించాలని తెలిపారు. అక్రమ లేఅవుట్లపై తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, మున్సిపల్‌ కమిషనర్లు బాలకృష్ణ, ఎంఏ ఖదీర్‌, గంగాధర్‌, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 

 నెలాఖరులోగా పూర్తి చేయాలి...

జిల్లాలోని 396 గ్రామాల్లో చేపట్టిన శ్మశాన వాటికల నిర్మాణాలను  నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. పల్లెప్రగతిలో చేపట్టిన పనులపై కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వనాలు వందశాతం పూర్తయ్యాయని, శ్మశాన వాటికలు కూడా పూర్తి చేయాలని సూచించారు. గ్రామాల వారీగా పనులు  ఏ స్థాయిలో ఉన్నాయో పవర్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో వెంకటేశ్వర్లు, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఈఈ సుదర్శన్‌రావు, ఎంపీడీవోలు, అధికారులు పాల్గొన్నారు.