మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Nov 11, 2020 , 02:30:35

‘ఈ-ఆఫీస్‌'ను వంద శాతం అమలు చేయాలి

‘ఈ-ఆఫీస్‌'ను వంద శాతం అమలు చేయాలి

  • కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ అర్బన్‌ : జిల్లాలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో  (ఈ- ఆఫీస్‌) సాఫ్ట్‌వేర్‌ ద్వారా వంద శాతం దస్ర్తాల నిర్వహణను చేపట్టాలని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ‘ఈ-ఆఫీస్‌' పాలన అమలుపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా 

కలెక్టర్‌ మాట్లాడుతూ..కలెక్టరేట్‌, ఆర్డీవో కార్యాలయాలు, తహసీల్‌, మండల ప్రజాపరిషత్‌, మున్సిపల్‌, అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో దస్ర్తాల నిర్వహణను ఈ ఆఫీస్‌ ద్వారా   అమలు చేయాలని ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే ప్రతి శాఖకూ ఒక నోడల్‌ అధికారి, సాంకేతిక సహాయకుడిని నియమించి, శిక్షణ కూడా ఇచ్చామని వెల్లడించారు. ఈ ఆఫీస్‌ ద్వారా ప్రజలకు పారదర్శకంగా,  వేగవంతంగా సేవలు అందించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ సీఈవో సుధీర్‌, డీఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావు, డీఈవో ప్రణిత, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.