సోమవారం 25 జనవరి 2021
Nirmal - Nov 10, 2020 , 02:31:20

రామ్‌రావ్‌ ఆశయాలను సాధిద్దాం

రామ్‌రావ్‌ ఆశయాలను సాధిద్దాం

  • ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌
  • కొవ్వొత్తుల ర్యాలీ

నిర్మల్‌ టౌన్‌ : బంజారాల ఆరాధ్య దైవం సంత్‌ రామ్‌రావ్‌ మహరాజ్‌ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని బంజారాల సేవా సమితి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ తీశారు. కలెక్టర్‌ కార్యాలయం వద్ద గల కొండా లక్ష్మణ్‌ బాపూజీ విగ్రహం ఎదుట నివాళులర్పించి, ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంత్‌ రామ్‌రావ్‌ భౌతికంగా దూరమైనప్పటికీ బంజారాల కుటుంబాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. జిల్లా కేంద్రంలో విగ్రహ ఏర్పాటుకు మంత్రి అల్లోల హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రమేశ్‌, రవీందర్‌, వెంకట్రావ్‌, భీంరావ్‌, గోపాల్‌, మున్నాలాల్‌, జాదవ్‌ అంబాజీ, రాజేశ్‌నాయక్‌ పాల్గొన్నారు. 

మంత్రిని కలిసిన ఎమ్మెల్యే..

జిల్లా కేంద్రంలో బంజారా భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే రేఖానాయక్‌ మంత్రి అల్లోలను కలిసి విన్నవించారు. భవన నిర్మాణానికి రూ.3కోట్లు మంజూరు చేసినందుకు మంత్రికి అభినందనలు తెలిపారు. పనులు వెంటనే జరిగేలా చూడాలని కోరారు. logo