సోమవారం 25 జనవరి 2021
Nirmal - Nov 10, 2020 , 02:31:22

మధుసూదన్‌ సంతాప సభ..

మధుసూదన్‌ సంతాప సభ..

నిర్మల్‌ అర్బన్‌ : నిర్మల్‌ పట్టణంలోని దివ్యాగార్డెన్స్‌లో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి మధుసూదన్‌ సంతాప సభ నిర్వహించారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మధుసూదన్‌ చిత్రపటానికి పూలమాల వేశారు. మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మధుసూదన్‌ సేవలు మరువలేనివని మంత్రి అల్లోల కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముథోల్‌ ఎమ్మెల్యే విఠల్‌ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు కూచాడి శ్రీహరి రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ధర్మాజీగారి రాజేంధర్‌, పాకాల రాంచందర్‌, రాంకిషన్‌ రెడ్డి, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 


logo