గురువారం 21 జనవరి 2021
Nirmal - Nov 10, 2020 , 02:31:30

సమష్టి కృషితోనే సమగ్ర అభివృద్ధి

సమష్టి కృషితోనే సమగ్ర అభివృద్ధి

  • పల్లె, పట్టణ ప్రగతి ద్వారా ప్రగతికి పెద్దపీట
  • సభ్యులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం చూపా
  • మక్క కొనుగోళ్లను అధికారులు వెంటనే చేపట్టాలి..
  • జడ్పీ సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ టౌన్‌ :  జిల్లా సమగ్ర అభివృద్ధికి సమష్టిగా కృషి చేద్దామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని దివ్యాగార్డెన్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి అధ్యక్షతన సోమవారం జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఆ యన ముఖ్య అతిథిగా  మాట్లాడారు. ముందుగా స మావేశం ఎజెండాలోని అంశాలపై చర్చించారు. విద్యాశాఖ, ఆరోగ్య, పశు సంవర్ధక, ఉద్యానవన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మై నార్టీ సంక్షేమ, రెవెన్యూ, విద్యుత్‌, మార్కెటింగ్‌, వ్యవసా య, మత్స్య, మిషన్‌ భగీరథ,  పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ, జిల్లా పంచాయతీరాజ్‌ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల నివేదికలను ఆయా శాఖల అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాతే పల్లెలు అభివృద్ధి పథంలో వెళ్తున్నాయన్నారు. ఇందుకోసం ప్రతినెలా పల్లె ప్రగతిలో భాగంగా పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తుందన్నారు. ప్రాధాన్యత కింద చేపట్టిన హరిత వనాలు, సెగ్రిగేషన్‌ షెడ్లు, శ్మశానవాటికలు, రైతు వేదికల నిర్మాణాల్లో జిల్లా మంచి పేరు సాధించిందని కితాబిచ్చారు. అడవుల సంరక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. కొవిడ్‌ వైర స్‌ వ్యాప్తి నేపథ్యంలో ఖజానాకు ఆదాయం రాకున్నప్పటికీ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ అధికారులు ప్రజల్లోకి తీసుకెళ్లి అర్హులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలన్నారు. మూడు నెలలకొకసారి నిర్వహించే సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలను రాసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సూచించారు. మక్క కొనుగోళ్లను వెంటనే ప్రా రంభించాలని అధికారులను ఆదేశించారు. 

ఎమ్మెల్యేలను గౌరవించాలి : ఎమ్మెల్యే రేఖా నాయక్‌ 

కొందరు అధికారులు ఎమ్మెల్యేలకు తెలియకుండా తమ ని యోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ పేర్కొన్నారు. ఇటీవల తన నియోజకవర్గంలో సంబంధిత అధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా చేపలు విడుదల చేశారన్నారు. ప్రభుత్వంలో అధికారులు భాగస్వాములని ప్ర జాప్రతినిధులను గౌరవించినప్పుడే వారికి కూడా గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. సదరు అధికారులపై ప్రొటోకాల్‌ కింద చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించగా,  తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. 

మిషన్‌ భగీరథ నీరు అందాలి: ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి 

ఇంటింటికీ మిషన్‌ భగీరథ నీరు అందేలా చూడాలని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పేర్కొన్నారు. వేల కోట్లతో పనులు పూర్తి చేస్తే అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ కొన్ని గిరిజన గ్రామాలకు నీళ్లు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి స్పందిస్తూ నెల రోజుల్లోగా సర్వే చేసి రిపోర్టును ఎమ్మెల్యేకు అందించాలని ఈఈని ఆదేశించారు. 

అభివృద్ధికి పాటుపడాలి: విజయలక్ష్మి, జడ్పీ చైర్‌పర్సన్‌

పల్లెల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని జడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి అన్నారు. పంచాయతీరాజ్‌శాఖ ఆధ్వర్యం లో పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులను మం జూరు చేస్తున్నదని, వాటిని సక్రమంగా వినియోగించుకొని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. 

చెరువుల ఆక్రమణలపై విచారణ చేస్తాం.. కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ

ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. సారంగాపూర్‌ స్వర్ణ ప్రాజెక్టులో 600 ఎకరాల భూమి కబ్జాకు గురైందని సారంగాపూర్‌ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి సభలో పేర్కొన్నారు. మూడు రోజుల్లో ఆర్డీవోతో విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ చెప్పారు.  సమావేశంలో ముథోల్‌, ఖానాపూర్‌ ఎమ్మెల్యే లు విఠల్‌రెడ్డి, రేఖానాయక్‌, కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ, అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, డీసీఎంఎస్‌ చైర్మన్‌ లింగయ్య, జడ్పీ ఉపాధ్యక్షురాలు బాశెట్టి సాగరాబాయి, జడ్పీ సీఈవో సుధీర్‌కుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌, జిల్లా అధికారులు జయంత్‌రావు చౌహాన్‌, అం జిప్రసాద్‌, హన్మాండ్లు, దేవేందర్‌, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వర్‌రా వు, ప్రణిత, రమేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, శరత్‌బాబు, కిరణ్‌కుమా ర్‌, తుకారాం, రాజగోపాల్‌, రాజలింగం, కిషన్‌నాయక్‌, అశోక్‌కుమార్‌, ఎంపీపీలు, జడ్పీటీసీలు పాల్గొన్నారు. 


logo