ఆదివారం 24 జనవరి 2021
Nirmal - Nov 09, 2020 , 02:59:36

ప్రజల చెంతనే సేవలు...

ప్రజల చెంతనే సేవలు...

  • తగ్గిన దూర భారం n తహసీల్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు
  •  వ్యయ ప్రయాసలకు చెల్లుచీటి 
  •  ధరణి సేవలపై సర్వత్రా హర్షం

‘ధరణి’తో రైతులకు ‘రిజిస్ట్రేషన్‌' కష్టాలు తీరాయి. దూరభారంతోపాటు వ్యయ ప్రయాసలు తప్పాయి.. గతంలో 100 నుంచి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాలంటే అవస్థలు పడేవారు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగితే తప్ప, పట్టాదారు పాసు పుస్తకం చేతికొచ్చేది కాదు. ఇందుకోసం సాక్షులకు వాహనాలు, విందుతోపాటు వివిధ ఖర్చులు తడిసి మోపెడయ్యేవి. తాజాగా ధరణి పోర్టల్‌ ద్వారా తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావడంతో అన్ని ఇక్కట్లు తప్పాయి. మండల కేంద్రాల్లోనే పనులు పూర్తవుతుండడంతో, రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది.

-నిర్మల్‌, నమస్తే తెలంగాణ

ఖర్చులు తప్పినయ్‌..

నాది కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూర్‌ మండలం మర్తిడి గ్రామం. మా నాయిన పేరిటున్న భూమి నా పేరు మీద పట్టా చేయాలని తాసిల్దార్‌ను కలిసిన. ముందుగా మీసేవలో అప్లయ్‌ చేయమన్నడు. రిసిప్టు పట్టుకొని తాసిల్‌ ఆఫీసుకు పోయిన. మా ఇవురాలన్నీ అడిగి కంప్యూటర్‌లో కొట్టి చూసిండు. ఏలిముద్రలు, ఫొటోలు తీసుకున్నడు. కొంచమైనంక పట్టా అయింది అంటూ పత్రాలు ఇచ్చిండు. గిదంతా రెండు గంటలల్లనే అయింది. మునుపటి లెక్క పట్టాలు చేసుకోవాలంటే మా ఊరి నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసిఫాబాద్‌కు పోకటుండేది. నలుగురు సాక్షులను ఎంటబెట్టుకొని పోయి వాళ్లకు తిండి ఖర్చులు, బస్సు చార్జీలు పెట్టుకునేటోళ్లం. తెల్లారినంక పోతే ఇంటికచ్చేటప్పటికి నడిరాత్రి అయ్యేది. సార్లు లేరంటే ఆపస్‌ అచ్చెటోళ్లం. కేసీఆర్‌ సారు ధరణి పోర్టల్‌ పెట్టి మాకు ఖర్చులు, దూరం తగ్గించిండు. మండలంలనే అన్ని పనులు అయ్యేట్టు చేసిండు. సారుకు దండాలు.

    నిర్మల్‌, నమస్తే తెలంగాణ: ధరణి పోర్టల్‌తో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ చకచకా సాగుతున్నది. మండల కేంద్రాల్లోనే పనులు పూర్తవుతుండడంతో, రైతులకు వ్యయ ప్రయాసలు తప్పాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి బెజ్జూర్‌ మండలంలోని తలాయి గ్రామానికి మధ్య దూరం 110 కి.మీ ఉంది. వీరితో పాటు పరిసర గ్రామాల ప్రజలు ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి రావాలంటే ఆటోలు, బస్సులు మారాల్సి వచ్చేది. గ్రామం నుంచి బెజ్జూరుకు ఆటోల్లో, అక్కడి నుంచి కాగజ్‌నగర్‌కు బస్సులో, అక్కడి నుంచి ఆసిఫాబాద్‌కు మరో బస్సు ఎక్కి రావాల్సి వచ్చేది. తహసీల్‌ కార్యాలయం అన్ని గ్రామాలకు 15కిలో మీటర్ల లోపే ఉండడంతో, ఇప్పుడు రిజిస్ట్రేషన్ల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన తిప్పలు తప్పాయి. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి చింతలమానేపల్లి మండలం గూడెం, కోర్సిని 85 కి.మీ దూరం ఉండగా,
కాగజ్‌నగర్‌కు బస్సులో వచ్చి, అక్కడి నుంచి ఆసిఫాబాద్‌కు మరో బస్సులో వచ్చేవారు. ప్రస్తుతం ఆయా గ్రామాలకు మండల కేంద్రం 20 కిలో మీటర్లలోపే ఉండడంతో, ఎంతో సౌకర్యంగా మారింది. ఆసిఫాబాద్‌కు దహెగాం మండలంలోని మొట్లగూడ, రాంపూర్‌కు మధ్య 90-95 కి.మీ దూరం ఉండగా, ఆటోల్లో దహెగాంకు వచ్చి. అక్కడి నుంచి బస్సుల్లో కాగజ్‌నగర్‌కు రావాలి. కాగజ్‌నగర్‌ నుంచి ఆసిఫాబాద్‌కు మరో బస్సులో వచ్చేవారు. ప్రస్తుతం 15 కిలోమీటర్ల లోపే మండల కేంద్రం ఉంది. ఆసిఫాబాద్‌కు లింగాపూర్‌ మండల కేంద్రానికి మధ్య దూరం 70 కి.మీ ఉండగా, లింగాపూర్‌ మండల వాసులు ఆటోల్లో సిర్పూర్‌(యు) మీదుగా జైనూర్‌ వచ్చేవారు. జైనూర్‌ నుంచి బస్సుల్లో ఆసిఫాబాద్‌కు చేరుకునేవారు. ప్రస్తుతం అన్ని గ్రామాలకు మండల కేంద్రం 5 నుంచి 15 కిలో మీటర్ల లోపే ఉన్నది.

మంచిర్యాల జిల్లాలో తప్పిన తిప్పలు..!

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల నియోజకవర్గాలకు మంచిర్యాలలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఉండేది. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లోని పలు గ్రామాల వారు 90 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉండేది. ఆటోలు, బస్సులు మార్చి మంచిర్యాల చేరుకోవాల్సి ఉండేది. మంచిర్యాలకు వేమనపల్లి మండలం సుంకుటం, గాజులపేట గ్రామాలు 90 కి.మీ దూరంలో ఉండగా, వీరు ఆటోలు ఎక్కి వేమనపల్లి వచ్చి.. చెన్నూర్‌ బస్సులో వచ్చేవారు. చెన్నూర్‌ నుంచి మళ్లీ బస్సులో మంచిర్యాల వెళ్లేవారు. ప్రస్తుతం అన్ని గ్రామాలకు 7 కి.మీ లోపు ఉండడంతో సౌకర్యంగా మారింది. నెన్నెల మండల వాసులు మంచిర్యాలకు రావాలంటే 55 నుంచి 60 కి.మీ దూరం ప్రయాణించి రిజిస్ట్రేషన్లకు వచ్చేవారు. ప్రస్తుతం 10 కి. మీ లోపే ఉన్నాయి. కోటపల్లి మండలం వెంకెపల్లి నుంచి మంచిర్యాలకు రావాలంటే 60 కి.మీ ఉండగా.. ప్రస్తుతం 20 కి.మీ లోపే ఉంది. 
ఇవి మచ్చుకు ఉదాహరణలు మాత్రమే..: గతంలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాలంటే పలు గ్రామాల ప్రజలు మూడు, నాలుగు వాహనాలు మారాల్సిందే. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల జిల్లా కేంద్రాల్లోని రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు వెళ్లాలంటే సుదూర ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఒకే ఒక్క సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉండగా.. ఆ జిల్లాలోని మారుమూల గ్రామాల వారు 100 నుంచి 110 కి. మీ దూరం ప్రయాణించి రావాల్సిన దుస్థితి ఉండేది. ప్రస్తుతం వివిధ గ్రామాలకు ఆయా మండల కేంద్రాలు 5 నుంచి 20 కి. మీ లోపే ఉండడంతో రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారాయి. గతంలో అన్ని రకాల భూములు, భవనాలు, ఆస్తులు, ఇండ్లు, వివాహాలు సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్‌ చేసేవారు. ఉమ్మడి జిల్లా పరిధిలో నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌, బోథ్‌, ఆదిలాబాద్‌, మంచిర్యాల, లక్షెట్టిపేట్‌, ఆసిఫాబాద్‌లో 8 చోట్ల రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలున్నాయి. కాగజ్‌నగర్‌, చెన్నూర్‌, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఒక్క సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం లేకపోగా, మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, లక్షెట్టిపేట రెండు చోట్ల ఉన్నాయి. మిగతా ఆరు నియోజకవర్గాల్లో ఒక్కోటి చొప్పున ఉన్నాయి. ముథోల్‌ నియోజకవర్గంలో భైంసాలో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉంది. 
ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 70 మండలాలుండగా :
ఒక్కో సబ్‌ రిజిస్ట్రార్‌ పరిధిలో సగటున 8-9 చొప్పున మండలాలు ఉండేవి. ఆసిఫాబాద్‌ జిల్లా మొత్తానికి ఒకే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం ఉండగా, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు ఇదే ఆధారంగా ఉంది. బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల నియోజకవర్గాలకు కలిపి మంచిర్యాలలోనే ఉంది. దీంతో ప్రజలకు దూరభారం, వ్యయ ప్ర యాస, సమయం వృథా అయ్యేది. గతంలో రిజిస్ట్రేషన్‌కు వ స్తే.. ముందు రోజు స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్‌ తేదీ రోజున క్రయ, విక్రయ దారులతో పాటు సాక్షు లు, పెద్ద మనుషులు వచ్చేవారు. వీరందరినీ ఆటోలు, బస్సులు, వాహనాల్లో వచ్చేందుకు రూ.1500-రూ. 2వేల వరకు ఖర్చులయ్యేవి. వచ్చిన వారికి విందు పేరిట మరో రూ.3 నుంచి 5వేల వరకు ఖర్చయ్యేది. రిజిస్టర్‌ డాక్యుమెంట్లకు మరోసారి రావాల్సి వచ్చేది. కొన్ని సార్లు అదే రోజు రిజిస్ట్రేషన్‌ కాక.. మరోరోజు వెళ్లాల్సి వచ్చేది. దీంతో దూరభారంతో పా టు వ్యయ ప్రయాసలు ఉండేవి.
ప్రస్తుతం మండల కేంద్రాల్లోని తహసీల్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో.. అ న్ని గ్రామాలకు మండల కేం ద్రాలు 5నుంచి 20కి.మీ లోపే ఉండడంతో ఇబ్బందులు తప్పాయి. గతంలో ఉమ్మడి జిల్లాల్లో 52 మం డలాలు ఉండగా, కొత్తగా 18 మండలాలు ఏర్పాటు చేయడంతో.. ప్రజలకు మ రింత సౌలభ్యంగా మారిం ది. ముందురోజు స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటే, మరుసటి రోజు అరగంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌, అప్‌డేషన్‌ చేసి ఇస్తుండడంపై రై తులు హర్షం వ్యక్తంవ్యక్తం చేస్తున్నారు. 


logo