సోమవారం 25 జనవరి 2021
Nirmal - Nov 06, 2020 , 01:28:10

నిర్మల్‌ పట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

నిర్మల్‌ పట్టణాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం

  •  మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌
  • ధర్మసాగర్‌ మినీ ట్యాంక్‌బండ్‌ పనుల పరిశీలన

నిర్మల్‌ అర్బన్‌ : రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి సహకారంతో నిర్మల్‌ పట్టణాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌ అన్నారు. నిర్మల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహం నుంచి ప్రభుత్వ దవాఖాన వరకు ధర్మసాగర్‌ చెరువుకట్టపై చేపట్టిన అభివృద్ధి పనులను ఆయన గురువారం  పరిశీలించారు. పట్టణ ప్రజల సౌకర్యార్థం మినీ ట్యాంక్‌బండ్‌ను కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పనులు త్వరలోనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్‌ గండ్రత్‌ రమణ, నాయకులు, మున్సిపల్‌ ఏఈ వినయ్‌, తదితరులు పాల్గొన్నారు.logo