మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Nov 06, 2020 , 00:55:52

పట్టణ ప్రగతి పనుల్లో వేగం పెంచాలి

పట్టణ ప్రగతి పనుల్లో వేగం పెంచాలి

  • నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌ : జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచి, పూర్తి చేయాలని నిర్మల్‌ కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అధికారులను ఆదేశించారు. నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్ష నిర్వహించారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆయా మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు చేపట్టిన పనులు, పూర్తయిన వాటి వివరాలు, ఇంకా కొనసాగుతున్న పనుల వివరాలు తెలుసుకున్నారు. డిసెంబర్‌ నాటికి పనులన్నీ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని సూచించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు స్పందన వచ్చిందన్నారు. మున్సిపల్‌ సిబ్బంది అంకిత భావంతో పని చేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ హేమంత్‌బోర్కడే, జిల్లా అధికారులు పాల్గొన్నారు.