శనివారం 23 జనవరి 2021
Nirmal - Nov 06, 2020 , 00:55:56

దళారుల దందాకు చెక్‌

దళారుల దందాకు చెక్‌

  • ధరణితో సమస్త  సమస్యలకు పరిష్కారం
  • డాక్యుమెంట్‌ రైటర్ల అక్రమాలకు బ్రేక్‌
  •  పడిగాపులు, కాలయాపన లేకుండా పనులు
  • పత్రాల పరేషాన్‌ లేదు.. పైసల దందా లేదు
  • సజావుగా సకాలంలో పూర్తవుతున్న ప్రక్రియ
  •  సులభతరం, పారదర్శకంగా సేవలు
  • హర్షం వ్యక్తం చేస్తున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతులు

ధరణితో దళారుల దందాకు అడ్డుకట్ట పడింది. కాలయాపనకు తెరపడింది. డాక్యుమెంట్‌ రైటర్ల వసూళ్లకు బ్రేక్‌ పడింది. మ్యుటేషన్ల కోసం తిరుగాల్సిన పని తప్పింది. పట్టాదారు పాసు పుస్తకాల కోసం పడి గాపులు లేకుండా పోయింది. విరాసత్‌కు వివిధ పత్రాల పేరిట తిప్పుకునే అధికారులకు చెక్‌ పడింది. రోజుల తరబడి నిరీక్షణ, అక్రమ వసూళ్లు, కార్యాలయాల చుట్టూ తిరిగే తిప్పలు లేకుండా పోయాయి. ధరణి పోర్టల్‌తో సమస్త సమస్యలకు పరిష్కారం లభిం చగా, రైతులు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా మారింది. ఫలి తంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతాంగం హర్షం వ్యక్తం చేస్తున్నది. 

నిర్మల్‌, నమస్తే తెలంగాణ : ధరణి పోర్టల్‌తో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా రైతులకు మెరుగైన సేవలు అందుతున్నాయి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు తహసీల్‌ కార్యాలయాల్లో చేస్తుండగా. నాలుగు రోజులుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని 70 మండలాల తహసీల్‌ కార్యాలయాల్లో ఈ సేవలు అందుతున్నాయి. గతంలో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేయగా, రోజుల తరబడి నిరీక్షణ తప్పేది కాదు. ప్రస్తుతం రెండు రోజుల్లోనే అంతా పూర్తవుతున్నది. ముందు రోజు స్లాట్‌ బుకింగ్‌ చేసుకుంటే, మరుసటి రోజు 20 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్‌ పూర్తి చేస్తున్నారు.

మ్యుటేషన్‌ కోసం గతంలో రెండు, మూడు నెలల సమయం పట్టేది. పాసు పుస్తకాలకు ఏళ్ల తరబడి తిరిగిన రైతులు కూడా ఉన్నారు. భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి డాక్యుమెంట్‌ రైటర్లు కీలకంగా వ్యవహరించేవారు. వీరే స్లాట్‌ బుకింగ్‌ చేయడంతో పాటు చలానా తీసి, డాక్యుమెంట్‌ తయారు చేసి, రిజిస్ట్రేషన్‌ చేయించేవారు. వీరి ద్వారా అధికారులు వ్యవహారం నడిపించేవారు. వాస్తవానికి అధికారికంగా డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థ లేకపోగా, అనధికారికంగా డాక్యుమెంట్‌ రైటర్ల వ్యవస్థను రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులే ప్రోత్సహించారు. దీంతో ఆర్థిక లావాదేవీలు నడిపించేవారు. ఎకరాకు ఇంతని డబ్బులు తీసుకునేవారు. చిన్న తప్పులు ఉన్నా.. డబ్బులు వసూలు చేసేవారు. అనవసర తప్పులు, భయాలు సృష్టించి.. ఇబ్బందులకు గురి చేసేవారు. దీంతో రైతులు చేసేదేం లేక డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది. తాజాగా ఆన్‌లైన్‌లో స్లాట్‌ బుక్‌ చేశాక, తహసీల్‌ కార్యాలయంలో రూపాయి లంచం లేకుండా రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ చేస్తున్నారు. ప్రస్తుతం డాక్యుమెంట్‌ రైటర్ల ప్రమేయం లేకుండా పోయింది. తహసీల్‌ కార్యాలయంలో అధికారులు రూపాయి భారం పడకుండా..

అన్ని పనులు పూర్తి చేస్తున్నారు. విరాసత్‌ విషయంలో ధ్రువీకరణ పత్రాల పేరిట తిప్పుకునే వారు. వీటిని ఆసరాగా తీసుకుని.. రెవెన్యూ అధికారులు మ్యుటేషన్‌ కోసం పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసేవారు. తాజాగా ధరణితో ఇలాంటి సమస్యలు లేకుండా పోయాయి. కుటుంబ సభ్యులు ఉంటే.. వారి వివరాలు పొందు పరిస్తే సరిపోతుంది.  ఏడు రోజుల్లో సక్సెషన్‌ (విరాసత్‌), పార్టిషన్‌ (అన్నదమ్ముల మధ్య పంపకాలు) పూర్తవుతున్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 25 రిజిస్ట్రేషన్లుకుమ్రం భీం ఆసిఫాబాద్‌, నమస్తే తెలంగాణ: జిల్లాలో ధరణి పోర్టల్‌ ద్వారా 47 స్లాట్‌ బుకింగ్‌ కాగా, 25 రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మిగతా 22 రిజిస్ట్రేషన్లకు తేదీల వారీగా పూర్తి చేయనున్నారు.

27 నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి..

మామడ : నిర్మల్‌ జిల్లా మామడ తహసీల్‌ కార్యాలయం.. సమయం ఉదయం 11:30 గంటలు అవుతున్నది. అప్పటికే అధికారులు విధులకు హాజరయ్యారు. మిగతా సిబ్బంది ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. మండలంలోని కమల్‌కోట్‌ గ్రామానికి చెందిన నూకపెల్లి లలితకు గ్రామ శివారులో ఐదెకరాల భూమి ఉంది. ఆ భూమిలోంచి ఎకరం 10 గంటల భూమిని అదే గ్రామానికి చెందిన నూకపెల్లి లక్ష్మికి అమ్మింది. ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి లక్ష్మి కొడుకు విజయ్‌రెడ్డి మంగళవారం పొన్కల్‌ మీసేవ కేంద్రంలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకొని, లలిత, లక్ష్మి కలిసి ఉదయం 11:30 గంటలకు తహసీల్‌ కార్యాలయానికి వచ్చారు. నేరుగా తహసీల్దార్‌ శ్రీకాంత్‌ దగ్గరకు వెళ్లారు. విషయం ఆయనకు చెప్పి మీ సేవలో స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్న ఫారాలు, ఇతర డాక్యుమెంట్లు చూపారు. ఇద్దరినీ భూమి అమ్మకం, కొనుగోలు విషయాలు నిజమేనా? మీకు సమ్మతమేనా? అని అడిగారు. దానికి వారు అవును సార్‌ అని అన్నారు. డాక్యుమెంట్లు, ఆధార్‌ కార్డులు పరిశీలించారు. సాక్షులు వచ్చారా? అని ఇద్దరినీ అడిగారు.

వారి ఆధార్‌ కార్డులు చూసి పేర్లు అడిగారు. రావుల శ్రీనివాస్‌రెడ్డి, గంగమల్లేశ్‌ అని చెప్పారు. భూమి కొనుగోలు చేసింది నిజమేనా..? అని కొనుగోలు చేసిన నూకపెల్లి లక్ష్మి, భూమి అమ్మిన లలితను తహసీల్దార్‌ శ్రీకాంత్‌ ప్రశ్నించారు. వారు అవును సార్‌ ‘నేను లక్ష్మికి అమ్మిన..’ అని చెప్పడంతో ఫారాల్లో వారి వివరాలను నమోదు చేశారు. అందరి సంతకాలు తీసుకొని, నలుగురి ఐరిస్‌, బమోమెట్రిక్‌ సహాయంతో వేలిముద్రలు తీసుకున్నారు. ఈ ప్రక్రియ అంతా 20 నిమిషాల్లో పూర్త య్యింది. మరో ఐదు నిమిషాల్లో పాసు పుస్తకం వస్తుందని తహసీల్దార్‌ చెప్పడం తో కార్యాలయంలోనే వేచి ఉన్నారు. 11:57 గంటలకు కార్యాలయ సిబ్బంది మహిళా రైతు నూకపెల్లి లక్ష్మిని పిలిచారు. తహసీల్దార్‌ ఆమెకు పట్టాదార్‌ పాసు పుస్త కం అందజేశారు. పైసా ఖర్చులేకుండా పట్టా పాసు పుస్తకం చేతికి రావడంతో ఆమె చిరునవ్వుతో ఇంటిబాట పట్టింది. logo