పైసా ఖర్సు కాలె..

11 నిమిషాల్లోనే స్లాట్ బుకింగ్ అయింది..
ఆదివారం రాత్రి 11.02 గంటలు అవుతుంది. సారంగాపూర్ మండల కేంద్రంలోని మీ సేవ కేంద్రానికి పదిరే లక్ష్మారెడ్డి వచ్చాడు. కేంద్రం నిర్వాహకుడు శివాగౌడ్ను కలిశాడు. నిర్వాహకుడు లక్ష్మారెడ్డి ఆధార్, పాన్‌కార్డులు, పట్టాదార్ పాసుపుస్తకం ఇవ్వమన్నాడు. ఇంకా బంధువుల కార్డులు కూడా అడిగాడు. ఇచ్చిన వెంటనే స్కానింగ్ చేసి ధరణి వెబ్‌పోర్టల్‌లో అప్లోడ్ చేశాడు. చలాన్ కోసం రూ.3,400 కూడా తీసుకున్నాడు. 11.13 గంటలకు ఈ-చలాన్ రిసిప్ట్, సేల్‌డీడ్ కాపీలను మీ సేవ నిర్వాహకుడు రైతు పదిరే లక్ష్మారెడ్డికి అందించాడు. ఇదంతా పని చేసినందుకు నిర్వాహకుడు రూ.117లు తీసుకున్నాడు. మంగళవారం తహసీల్ కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపాడు.
గంటలో రిజిస్ట్రేషన్ కంప్లీట్..
సారంగాపూర్ తహసీల్ కార్యాలయం సిబ్బందితో కళకళలాడుతున్నది. మంగళవారం ఉదయం 11.06 గంటలకు పదిరే లక్ష్మారెడ్డి వచ్చాడు. హాలులో ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. 11.10 గంటలకు ఆర్ఐ ముంతాజ్ పిలిచారు. తన వద్ద ఉన్న ఫారంలో ఆధార్, పాన్ కార్డుల్లోని వివరాలను పూరించాడు. తర్వాత 11.20 గంటలకు లక్ష్మారెడ్డి తమ్ముడు గంగారెడ్డి, సాక్షులు మాజీ సర్పంచ్ చంద్రప్రకాశ్‌గౌడ్, రైతు భోజారెడ్డి ఆధార్‌కార్డులు తీసుకొని వారి వివరాలను కూడా ఫారంలో నమోదు చేశారు. 11.30 గంటలకు అందరి ఆధార్‌కార్డులు తీసుకొని వెరిఫికేషన్ చేసి బయోమెట్రిక్ ద్వారా ఫొటోలు తీసుకున్నారు. అనంతరం 11:50 గంటలకు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పూర్తయిందని తెలిపారు. వెంటనే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ల కాపీలను మధ్యాహ్నం 12 గంటలకు తహసీల్దార్ తుకారాం సంతకం చేసి ఇచ్చారు. కేవలం గంటలోనే పని పూర్తవడంతో లక్ష్మారెడ్డి సంతోషంగా ఇంటికి వెళ్లాడు.
ఖర్సు తప్పింది..
రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ పత్రాలు తీసుకొని తహసీల్ కార్యాలయం నుంచి ఇంటికి వెళ్తున్న లక్ష్మారెడ్డిని ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. లక్ష్మారెడ్డి ఆనందంతో పొంగిపోతూ మాట్లాడాడు. “ఇంతకుముందు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే నిర్మల్ పట్టణానికి వెళ్లాల్సి వచ్చేది. దాదాపు గంట సమయం పట్టేది. అందరం కలిసి పోవాలంటే వాహనం తీసుకొని వెళ్లాల్సి వచ్చేది. కార్యాలయంలోకి వెళ్లగానే సిబ్బంది బయట ఉన్న దస్తావేజుల లేఖరిని కలువమని చెప్పేవారు. వారు పత్రాలు తీసుకొని చార్జి కింద దాదాపు రూ.1,500 నుంచి రూ.2వేలు తీసుకునే వారు. రెండు, మూడు రోజుల తర్వాత రమ్మని చెప్పేవారు. వెళ్లిన తర్వాత వారు వచ్చే డాక్యుమెంట్లను పట్వారీ, ఎమ్మార్వోకు ఇచ్చేది. ఆరు నుంచి సంవత్సరం తర్వాత పట్టాదార్ పాస్‌పుస్తకం చేతికొచ్చేది. ప్రస్తుతం ధరణి అందుబాటులోకి రావడంతో మా మండల కేంద్రంలోనే తహసీల్ కార్యాలయానికి వెళ్లా. సమయం ఆదా అయింది. దాదాపు రూ.10 వేల వాహన, ఇతర ఖర్చులు తగ్గాయి. దళారుల బెడద లేదు. కేవలం ఛాయ్ ఖర్చు కూడా లేకుండా పని పూర్తయింది.
తాజావార్తలు
- కొత్త యాప్‌లు వాడుతున్న ఉగ్ర మూకలు
- త్వరలో మరో ‘జన్ రసోయి’ని ప్రారంభిస్తాం: గౌతమ్ గంభీర్
- రైతు సంక్షేమానికి సర్కారు కృషి : మండలి చైర్మన్ గుత్తా
- నానబెట్టిన నల్ల శనగలు తినొచ్చా.. తింటే ఏంటి లాభం.?
- సీఎంఆర్ సంస్థను రద్దు చేయాలి
- ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల్లో కేసీఆర్‌కు ఐదో స్థానం
- స్టంట్ చేస్తుండగా సంపూర్ణేశ్‌కు ప్రమాదం..!
- ఏపీలో కొత్తగా 158 కరోనా కేసులు
- మెరుగ్గానే శశికళ ఆరోగ్యం
- రాజస్థాన్ రాయల్స్ క్రికెట్ డైరెక్టర్‌గా సంగక్కర