మంగళవారం 19 జనవరి 2021
Nirmal - Nov 04, 2020 , 00:25:43

ప్రకృతి వనం.. ప్రారంభానికి సిద్ధం

ప్రకృతి వనం.. ప్రారంభానికి సిద్ధం

నార్నూర్‌ : ఆ గ్రామం ఎన్నో అభివృద్ధి పనులకు నిదర్శనంగా నిలుస్తున్నది. మరెన్నో అవార్డులను అందుకున్నది. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నది. ఇప్పుడు విలేజ్‌ పార్కును అద్భుతంగా తీర్చిదిద్ది అబ్బురపరుస్తున్నది. ఆ గ్రామమే ఆదిలాబాద్‌ జిల్లాలోని నార్నూ ర్‌ గ్రామం. సర్పంచ్‌ బానోత్‌ గజానంద్‌నాయక్‌ ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులు చేపడుతూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పల్లెలను పచ్చగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రకృతి వనంలో భాగంగా రాజమండ్రి నుంచి ఆకర్షణీయమైన మొక్కలను తెప్పించారు. పార్కులో ఇరువైపులా సరిహద్దులు ఏర్పాటు చేసి చుట్టుపక్కల మొక్కలు నాటారు. పర్యాటకులు సేదతీరేందుకు గద్దెలను ఏర్పాటు చే శారు. దీంతో పల్లె ప్రకృతి వనం చూపరులకు కనువిందు చేస్తున్నది. పార్కును సందర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు సర్పంచ్‌ను అభినందిస్తున్నారు. ఆహ్లాదం పంచుతున్న ప్రకృతి వనం జిల్లాకే ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొంటున్నారు.